ఆసిన్ కూతురుని చూశారా ? ఎంత బాగా వంట చేస్తుందో ..!

తెలుగు, తమిళ ఇండస్ట్రీ ప్రముఖ హీరోయిన్ ఆసిన్ పెళ్లి తర్వాత సినిమాలకు బై బై చెప్పేసింది.

ఇంకా ఈ బ్యూటీ రాహుల్ శర్మ అనే వ్యాపార వేత్తను 2016 లో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

వీరిద్దరికీ ఒక చిన్నారి ఉంది పేరు అరిన్.నిరంతరం ఆసీన్ తన చిన్నారి అయిన ఆరిన్ కు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటోంది.

అంతేకాకుండా గత సంవత్సరం తన కూతురు పుట్టినరోజు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఆ ఫోటోలు వైరల్ గా మారడం జరిగింది.ఇక తాజాగా ఈ బ్యూటీ అరీన్ వంటగదిలో వంట చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తన కూతురు ఎంతో శ్రద్ధగా కూరగాయలు కట్ చేస్తూ వాటిని పాత్రలో వేస్తూ అనంతరం స్టౌ పై పెట్టి కూర చేస్తున్నట్లు ఉంది.వాస్తవానికి ఈ ఫోటోలు నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

అలాగే ఇంకొక వీడియోలో ఆరీన్ ఇంటిని శుభ్రం చేస్తూ అలసిపోయినట్లు కనిపించింది.ఇంకా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

ఇక ఆసీన్ దక్షిణాది అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకుంది.ఇకపోతే వివాహం అనంతరం మాత్రం సినిమాలకు పూర్తిగా దూరం అయింది.ఈ బ్యూటీకి మన తెలుగులో శివమణి, ఘర్షణ, గజిని, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి.

లాంటి సినిమాలు మంచి హిట్ తో పాటు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి.ఆసిన్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ హ్, హిందీ సినిమాలలో కూడా నటించింది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు