కౌబాయ్ గెటప్ లో మహేష్ మేనల్లుడు... సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా

ఈ మధ్య స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి వారసుల దిగుమతి ఎక్కువైంది.

మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఆయన ఇమేజ్ ఉపయోగించుకొని ఇప్పటికి 12 మంది హీరోల వరకు వచ్చారు.

రీసెంట్ గా కొనెదల పవన్ తేజ్ అనే కుర్రాడు కూడా మెగాస్టార్ తన బాబాయ్ అంటూ హీరోగా ఎంట్రీ అయ్యాడు.ఇక సూపర్ స్టార్ కృష్ణ నటవారసులుగా రమేష్ బాబు, మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చారు.

రమేష్ బాబు ప్రస్తుతం సినిమాలు వదిలేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ని రూల్ చేస్తున్నాడు.

మహేష్ బాబు బ్రాండ్ ఇమేజ్ తో అతని చెల్లెలు భర్త సుదీర్ బాబు హీరోగా పరిచయం అయ్యాడు.తనకంటూ సొంతగా ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి సుదీర్ బాబు ప్రయత్నం చేస్తున్నాడు.

Advertisement

ఇప్పుడు మహేష్ బాబు అక్క కొడుకు గల్లా జయదేవ్ వారసుడు గల్లా అశోక్ సూపర్ స్టార్ మహేష్ బ్రాండ్ ఇమేజ్ ఉపయోగించుకొని హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా అశోక్ ని లాంచ్ చేయడానికి తండ్రి గల్లా జయదేవ్ నిర్మాతగా మారిపోయాడు.

ఇదిలా ఉంటే ఇన్ని రోజులు సైలెంట్ గా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా నుంచి ప్రీలుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.టైటిల్ ఎనౌన్స్ సందర్భంగా ఈ ప్రీలుక్ పోస్టర్ లాంచ్ చేశారు.

ఇందులో గల్లా అశోక్ కౌబాయ్ గెటప్ లో కనిపించడం విశేషం.సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబులకి కౌబాయ్ గెటప్ అనేది ప్రత్యేక గుర్తింపునిచ్చింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యామిలీ హీరో అనే బ్రాండ్ ని మెయింటేన్ చేయడం కోసం మహేష్ ఫాన్స్ ని ఎట్రాక్ట్ చేయడం కోసం గల్లా అశోక్ కూడా అదే గెటప్ లో పరిచయం కావడం విశేషం.ఈ లుక్ కి మహేష్ ఫ్యాన్స్ భాగానే ఫిదా అయ్యారు.

Advertisement

అయితే ఆ బ్రాండ్ తో వచ్చిన అశోక్ ని ఎంత వరకు ప్రోత్సహిస్తారనేది వేచి చూడాలి.

తాజా వార్తలు