బొప్పాయి గింజలను పడేస్తున్నారా.. అయితే వాటిలో ఉన్న పోషకాలు గురించి తెలిస్తే షాక్ అవుతారు..!

ముఖ్యంగా చెప్పాలంటే బొప్పాయి పండు( Papaya fruit ) తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి దాదాపు చాలామందికి తెలుసు.

దాదాపు చాలామంది ప్రజలు అన్నీ సీజన్ లలో దీన్ని తింటూ ఉంటారు.

పచ్చి బొప్పాయితో హల్వా కూడా చేసుకుని తింటారు.ఇంకా చెప్పాలంటే బొప్పాయి కాయలలో ఆకుల్లో కూడా అనేక పోషకాలు ఉన్నాయి.

ఈ ఆకుల రసాన్ని తాగితే కొద్దిగా గంటల్లోనే ప్లేట్ లెట్లు పెరుగుతాయి.అంతేకాకుండా ఈ ఆకులలోనీ రసాన్ని వివిధ అనారోగ్య సమస్యలకు కూడా ఉపయోగిస్తారు.

అయితే బొప్పాయి పండు లో నల్లని రంగు గింజలు కనిపిస్తాయి.ఆ గింజలను పడేసి పండును తింటూ ఉంటారు.

Advertisement

కానీ బొప్పాయి గింజల వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

వీటి గురించి తెలిస్తే ఆ గింజల్ని అస్సలు వదలరు.మరి వాటిలో ఉండే పోషకల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.బొప్పాయి గింజలలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.

ఈ ఎంజైమ్ జీర్ణ క్రియకు( Digestion ) ఎంతగానో ఉపయోగపడుతుంది.చాలా మంది జీర్ణ క్రియ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

అలాంటి వారు ఈ బొప్పాయి గింజల్ని తీసుకోవచ్చు.ఇవి తినడం వల్ల మలబద్ధకం, కడుపులో నొప్పి(stomach Pain ) అజీర్తి వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

అలాగే బొప్పాయి గింజల్లో ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ సమ్మేళనాలు ఉంటాయి.వీటివల్ల శరీరంలో వాపులు ఉంటే వాటిని తగ్గించుకోవచ్చు.

Advertisement

ఈ బొప్పాయి గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

ఇవి కాలేయన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.అంతేకాకుండా ఈ గింజలు శరీరంలోని వ్యర్ధాలను, మలినాలను బయటకు పంపుతాయి.బొప్పాయి గింజలలో శక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉంటాయి.

ఇవి శరీరంలో ఇమ్యూనిటీని పెంచి వ్యాధులతో పోరాడేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.అలాగే ఈ గింజల్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది.

వీటితో కలిపిన ఆహారాన్ని కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఉన్న భావన కలుగుతుంది.కాబట్టి అధిక బరువును ( Overweight )దూరం చేసుకోవాలనుకునేవారు వీటిని ఉపయోగించవచ్చు.

ఇవి కొలెస్ట్రాల్( Cholesterol ) స్థాయిలను తగ్గించడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల ను కూడా నివారిస్తాయి.

తాజా వార్తలు