ఇదిగో మిమ్మలనే వింటున్నారా.. రూ.599కే విమాన ప్రయాణమంట తెలుసా?

ఎయిర్ ఇండియా భారతదేశపు(Air India) అతి పురాతన విమానయాన సంస్థగా పేరుగాంచింది.

ఇది ప్రస్తుతం టాటా గ్రూప్ ఆధ్వర్యంలో కొనసాగుతూ ప్రయాణికులకు అనేక రకాల ప్రయాణ అనుభవాలను అందిస్తోంది.

అంతర్జాతీయ, దేశీయ విమాన సేవల్లో విశ్వసనీయతను ప్రదర్శిస్తూ, ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించడానికి ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లను అందిస్తోంది.ఇందులో భాగంగానే.

ఎయిర్ ఇండియా తాజాగా దేశీయ ప్రయాణికులకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది.కేవలం రూ.599కే ప్రీమియం ఎకానమీ ఫ్లైట్ టిక్కెట్లు(Premium Economy flight tickets for Rs.599) అందుబాటులోకి తీసుకువచ్చింది.సాధారణంగా విమాన ప్రయాణం ఖరీదుగా ఉంటుంది.

అయితే, మధ్య తరగతి ప్రజలు కూడా విమాన ప్రయాణాన్ని ఎంచుకునేలా ఈ ఆఫర్‌ను తీసుకువచ్చింది.

Are You Listening Do You Know About Air Travel For Rs. 599, Air India, Flight
Advertisement
Are You Listening? Do You Know About Air Travel For Rs. 599?, Air India, Flight

ఈ ఆఫర్ కింద ఎయిర్ ఇండియా మొత్తం 39 దేశీయ రూట్లలో ప్రయాణించే అవకాశం కల్పించింది.ముఖ్యంగా డిమాండ్ ఉన్న కొన్ని ముఖ్యమైన మార్గాల్లో ప్రయాణించేందుకు తక్కువ ధరల టిక్కెట్లు లభించనున్నాయి.ఈ ఆఫర్ కింద అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన మార్గాల విషయానికి వస్తే.ముంబై - హైదరాబాద్, ఢిల్లీ - హైదరాబాద్, ఢిల్లీ - ముంబై, ఢిల్లీ - బెంగళూరు, ముంబై - బెంగళూరు(Mumbai - Hyderabad, Delhi - Hyderabad, Delhi - Mumbai, Delhi - Bangalore, Mumbai - Bangalore) ఈ మార్గాల్లో కేవలం రూ.599కే ప్రీమియం ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది.

Are You Listening Do You Know About Air Travel For Rs. 599, Air India, Flight

ఎయిర్ ఇండియా వారానికి 50,000 సీట్లను డిస్కౌంట్ ధరలకు అందించనుంది.అదనంగా, ప్రీమియం ఎకానమీ సీట్ల సంఖ్యను 30% పెంచింది.దీంతో మొత్తం డిస్కౌంట్ ధర టిక్కెట్ల సంఖ్య వారానికి 65,000 దాటింది.

వీటిలో 34,000 సీట్లు మెట్రో నగరాల మధ్య ఉన్నాయి.ఎయిర్ ఇండియా ప్రీమియం ఎకానమీ కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తోంది.

ఇందులో ఫ్రీగా సీట్లు సెలెక్ట్ చేసుకునే సదుపాయం, చెక్-ఇన్ మరియు బోర్డింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత, అదనపు లగేజీ బెనిఫిట్స్ లాంటి ప్రయోజనాలను అందిస్తోంది.ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవడం ద్వారా మధ్య తరగతి ప్రయాణికులు తక్కువ ఖర్చుతో మెరుగైన ప్రయాణ అనుభవాన్ని పొందవచ్చు.

ఐఐటీ క్యాంపస్‌లో మొసలి.. ఫిమేల్ స్టూడెంట్స్ ఏం చేశారో చూస్తే అవాక్కవుతారు..
మనిషిలాగే రోబో కాఫీ కొంటోంది.. టెక్నాలజీ అద్భుతం చూస్తే నమ్మలేరు..

టాటా గ్రూప్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా అధిక మంది ప్రయాణికులు విమాన ప్రయాణాన్ని ఎంచుకునే అవకాశం లభించనుంది.

Advertisement

తాజా వార్తలు