ఆ పెట్టుబడి కోసం అప్పు చేస్తున్నారా.. అయితే డేంజర్‌లో పడ్డట్టే..

ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు డబ్బులు పెట్టుబడి పెట్టి  రెండింతలు లాభాలు ఆర్జించాలని భావిస్తున్నారు.

కానీ చేతిలో సరిపడా డబ్బులు లేక అప్పులు చేసి మరీ పొదుపు చేస్తున్నారు.

అయితే ఇలా పెట్టుబడి కోసం అప్పు చేస్తే డేంజర్‌లో పడ్డట్టేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.కొందరు ప్రజలు 10-13% రుణంతో అప్పులు తీసుకొని స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గుచూపుతున్నారు.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ స్థాయిలో లాభాలు వస్తాయని బలంగా నమ్ముతున్నారు.అయితే ఇది నిజమే కానీ స్టాక్ మార్కెట్ ఎప్పుడూ లాభాలను తెచ్చిపెడుతుందని అనుకుంటే పొరపాటు పడ్డట్టే.

ఎందుకంటే అప్పు తెచ్చిన సొమ్ము అంతా కూడా స్టాక్ మార్కెట్‌లో ఒక్కసారిగా ఆవిరి అయ్యే ప్రమాదం ఉంది.ఒకవేళ ఇలా జరిగితే రుణంతో పాటు వడ్డీ కూడా కట్టాల్సి వస్తుంది.

Advertisement

ఇది మిమ్మల్ని ఆర్థికంగా మరింత కష్టాల్లోకి నెట్టే ప్రమాదం ఉంది.ఆర్థిక నిపుణుల ప్రకారం, పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న సొంత డబ్బులతోనే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

అప్పు తీసుకోవడం చాలా ప్రమాదకరం.కొందరు పర్సనల్ లోన్ తీసుకుని షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు.

అయితే మంచి నాలెడ్జ్ ఉంటే మాత్రమే లాభాలు ఆర్జించడం సాధ్యమవుతుంది.

కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారందరూ కూడా క్యాపిటల్ మొత్తం పోగొట్టుకుంటారు.ఈ విషయాన్ని గుర్తించి.మళ్ళీ పర్సనల్ లోన్ తీర్చగలరని అంచనా వేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
పదో తరగతి, ఇంటర్ పరీక్షలలో సేమ్ మార్క్స్ సాధించిన ట్విన్ బ్రదర్స్.. గ్రేట్ అంటూ?

అనవసరంగా డబ్బుపై పేరాశతో అప్పులు చేస్తే మొదటికే మోసం వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.అయితే రుణాలు తీసుకోవడానికి బదులుగా కొద్దిరోజులపాటు పొదుపు చేయడం ద్వారా పెట్టుబడి పెట్టడం సాధ్యపడుతుందని సలహా ఇస్తున్నారు.

Advertisement

సొంత డబ్బుతో మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు పోగు చేయవచ్చని కూడా సలహా ఇస్తున్నారు.

తాజా వార్తలు