పెరుగుతో పాటు ఉల్లిపాయను మామిడి పండ్లను కలిపి తింటున్నారా.. అయితే ప్రమాదమే..!

పెరుగు ఆరోగ్యానికి మంచిదని దాదాపు చాలా మందికి తెలుసు.ప్రతిరోజు పెరుగు తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని పెద్దవారు చెబుతుంటారు.

పెరుగు మంచి ప్రోబయోటిక్ కావడం వల్ల ప్రేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.అయితే పెరుగును చాలామంది ఏదో ఒక దాంట్లో కలుపుకుని తింటూ ఉంటారు.

కొన్ని ఆహార పదార్థాలు కలిపి తినడం వల్ల ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది.పెరుగు లో పండ్లు కలుపుకునే తినవచ్చు.

సలాడ్, రైతా వంటివి చేసుకుని తినవచ్చు.పెరుగు( Curd ) తో పాటు కలుపుకుని తినకూడని కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

చాలామంది పెరుగు లో మామిడి పండ్లు( Mangoes ) కలుపుకొని తింటారు.మామిడి పండ్లు వేడి గుణాలను కలిగి ఉంటుంది.పెరుగు చలువ గుణం కలిగి ఉంటుంది.

ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి వేడి చల్లని అసమతుల్యతను కలిగిస్తుంది.ఇది చర్మ సమస్యలను కలిగిస్తుంది.

చర్మంపై దద్దుర్లు, మొటిమలు ఏర్పడడం జరుగుతుంది.శరీరంలో టాక్సిన్స్ ఉత్పత్తిని పెంచుతుంది.

మాంసాహారం వండేటప్పుడు మాంసాన్ని పెరుగుతో మెరినేట్ చేస్తారు.కానీ చేపలు, సముద్రపు ఆహారంలతో పెరుగును అసలు కలపి తినకూడదు.

విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?

ఇలా తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది.

Advertisement

అలాగే పెరుగు తిన్న తర్వాత పాలు త్రాగడం కూడా అసలు చేయకూడదు.పాలు తాగిన తర్వాత పెరుగు కూడా తినకూడదు.ఒకవేళ ఈ రెండింటిని కలిపి తీసుకుంటే గ్యాస్ ఉబ్బరం కడుపు గుండెల్లో మంట లాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అలాగే పెరుగుతో పాటు నెయ్యి, నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలను కూడా అసలు తినకూడదు.ఇలా ఈ ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల తినడం వల్ల జీర్ణ వ్యవస్థ( Digestive system ) పై చెడు ప్రభావం పడుతుంది అలాగే నిద్ర మత్తు కూడా ఎక్కువగా ఉంటుంది.

అలాగే పెరుగుతో పాటు ఉల్లిపాయలు కూడా అసలు తినకూడదు.

తాజా వార్తలు