Netflix Account : ఇతరులు మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ వాడుతున్నారా.. సింపుల్ ట్రిక్‌తో తొలగించండిలా

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్ ద్వారా మనం చూడొచ్చు.

వివిధ దేశాల్లోని వెబ్ సిరీస్‌లు, సినిమాలు ప్రాంతీయ భాషల్లోకి కూడా అనువాదం అవుతున్నాయి.

అందుకే నెట్‌ఫ్లిక్స్‌కు నానాటికీ ఆదరణ పెరుగుతోంది.Netflix ఖాతా అనేది పూర్తిగా మీదే కాదు.

మీ నెట్‌ఫ్లిక్స్ ఖాతాను మీరు మాత్రమే ఉపయోగించలేరు.దానిని మిగిలిన వారు కూడా ఉపయోగించే అవకాశం ఉంది.

దీనికి మూడు స్క్రీన్లలో చూసుకునే సౌలభ్యం ఉంది.అయితే మీ నెట్ ఫ్లిక్స్ ను ఇతరులు ఉపయోగించుకోకుండా మీరు నిరోధించవచ్చు.

Advertisement

దీనికి సంబంధించి కొన్ని ట్రిక్స్‌తో ఇతర అకౌంట్లు డిస్‌ కనెక్ట్ చేయవచ్చు.

మీ నెట్‌ఫ్లిక్స్ ఖాతా నుండి ఇతరులకు చెప్పకుండానే వారిని తొలగించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.మీరు ఖాతా నుండి ఇతర గ్యాడ్జెట్లను తొలగించవచ్చు.ముందుగా, Netflix యాప్‌ని తెరిచి, అకౌంట్‌పై క్లిక్ చేయండి.

సెట్టింగ్‌ను ఓపెన్ చేస్తే అక్కడ మీకు మీ నెట్ ఫ్లిక్స్ ఖాతా ఏయే గ్యాడ్జెట్లలో ఉందో తెలుస్తుంది.మీకు అవసరం లేని గ్యాడ్జెట్లపై క్లిక్ చేసి, సైన్ అవుట్ చేస్తే మీ నెట్ ఫ్లిక్స్ ఖాతాను వేరే వాళ్లు ఉపయోగించలేరు.

మీరు మీ నెట్‌ఫ్లిక్స్ ఖాతా నుండి ఎప్పుడైనా ప్రొఫైల్‌ను కూడా తీసివేయవచ్చు.మీ ఖాతా నుండి ప్రొఫైల్‌ను తీసివేయడానికి మీరు PCలో మీ ఖాతాకు సైన్ ఇన్ చేయాలి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

ఆ తరువాత, ఈ దశలను అనుసరించాలి.మీ ఖాతాను తెరిచి, ఆపై ప్రొఫైల్‌లను సెర్చ్ చేయండి.

Advertisement

ఇప్పుడు, మీరు మీ ఖాతాకు లింక్ చేయబడిన అన్ని ప్రొఫైల్‌లను చూస్తారు.ఏదైనా ప్రొఫైల్‌పై నొక్కండి మరియు మీరు తొలగించాలనుకుంటున్న ప్రొఫైల్‌లోని ఎడిట్ చిహ్నాన్ని ఎంచుకోండి.

ఇప్పుడు, ప్రొఫైల్ రిమూవ్ బటన్‌పై క్లిక్ చేయండి.ఇలా మీరు అవసరం లేని గ్యాడ్జెట్ల నుంచి మీ నెట్ ఫ్లిక్స్ ఖాతాను తొలగించుకోవచ్చు.

దీంతో పాటు మీరు మీ పాస్ వర్డ్‌ను మార్చుకోవడం వల్ల కూడా నెట్ ఫ్లిక్స్ ఇతర అకౌంట్లను తొలగించవచ్చు.ఇలా మీ నెట్ ఫ్లిక్స్ ఖాతాను ఇతరులు వినియోగిస్తుంటే వాటిని తీసేయవచ్చు.

తాజా వార్తలు