బాబు న‌యా రూల్స్‌: ఏపీ మంత్రుల‌కు నో మొబైల్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు పాల‌నా ప‌రంగా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.కీల‌క నిర్ణ‌యాల విష‌యంలో అత్యంత గోప్య‌త పాటిస్తున్నారు.

కొన్ని విష‌యాలు ఆయ‌న త‌న‌కు బాగా కావాల్సిన కొంద‌రు మంత్రుల‌కు మాత్ర‌మే చెపుతున్నార‌ట‌.ప్ర‌భుత్వం తీసుకునే కొన్ని కీల‌క విష‌యాలు ప్ర‌జ‌ల‌కు తెలిసిన‌ప్పుడే కొంద‌రు మంత్రుల‌కు కూడా తెలుస్తున్నాయ‌న్న టాక్ ఏపీ స‌చివాల‌యంలో వినిపిస్తోంది.

దీనిని బ‌ట్టి చంద్ర‌బాబు పాల‌నా ప‌ర‌మైన విష‌యాల్లో ఎంత గోప్య‌త పాటిస్తున్నారో తెలుస్తోంది.చంద్ర‌బాబు గోప్య‌త‌, సీక్రెట్స్ మెయింటింగ్ దెబ్బ‌కు చాలా మంది మంత్రులు హైటెక్ చంద్రబాబు పాలనలో కాలం వెనక్కు వెళ్తోందని గుస‌గుస‌లాడుకుంటున్నార‌ట‌.

అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే అంతా హైటెక్ పాల‌న చేయాలంటోన్న చంద్ర‌బాబు త‌న మంత్రుల‌పై మాత్రం ఆంక్ష‌లు విధిస్తున్నార‌ట‌.మంత్రులు ఎవ్వ‌రూ మంత్రివ‌ర్గ స‌మావేశాల‌కు సెల్‌ఫోన్లు తీసుకురాకూడ‌ద‌న్న నిబంధ‌న‌లు ఇప్ప‌టికే ఉన్నాయి.

Advertisement

ఈ క్ర‌మంలోనే మంత్రులు మంత్రివ‌ర్గ స‌మావేశాల‌కు హాజ‌రైన‌ప్పుడు ఫోన్ల‌ను బ‌య‌టే సెక్యూరిటీ వ‌ద్ద ఇచ్చేస్తున్నారు.ఇప్ప‌టి వ‌ర‌కు ఈ నిబంధ‌న విజ‌య‌వాడ క్యాంపు కార్యాల‌యంలో మాత్ర‌మే అమ‌ల్లో ఉండ‌గా, ఇప్పుడు ఈ రూల్ వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యంలో కూడా పాటించాల‌ని బాబు ఆదేశాలు జారీ చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రులు ఎక్క‌డ‌కు వెళ్లినా సెల్‌ఫోన్ల‌ను త‌మ‌తో పాటే తీసుకెళుతూ ఉంటారు.అయితే ఇప్పుడు మంత్రివ‌ర్గ స‌మావేశాల‌తో పాటు స‌చివాల‌యంలో సైతం బ‌య‌టే సెక్యూరిటీ వ‌ద్ద ఇచ్చి వేయాల‌ని న‌యా రూల్స్ పెట్ట‌డంతో మంత్రులు తీవ్ర అసంతృప్తికి గుర‌వుతున్నారు.

ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టుకోవ‌చ్చ‌ని, అలాగే స్విచ్ఛాఫ్ చేసుకోవ‌చ్చ‌ని అలా కాకుండా బ‌య‌టే వ‌దిలేసి రావాల‌ని చెప్ప‌డంతో కొంద‌రు మంత్రులు బాబుపై ఫైరైపోతున్నార‌ని స‌మాచారం.ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌క‌పోయినా లోలోప‌ల వారే ఒక‌రికొక‌రు చెప్పుకుని తెగ ఇదై పోతున్నార‌ట‌.

ఏపీ ఎన్నికల ప్రచారానికి మోదీ.. రెండు రోజుల పర్యటన..!!

Advertisement

తాజా వార్తలు