ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంత కాలం నుండి టెన్త్ ఇంటర్, పరీక్షలు నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు మధ్య వాదోపవాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.కరోనా వైరస్ కారణంగా పరీక్షలు నిర్వహించకూడదని రద్దు చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
పరీక్ష రాసే సమయంలో విద్యార్థులకు వైరస్ వ్యాపించి వారి ద్వారా ఇంటిలో ఉన్న సభ్యులకు అంటితే పరిస్థితి ఏంటి అని ప్రభుత్వం పై మండి పడుతున్నారు.కేంద్ర ప్రభుత్వం తమ ఆధీనంలో నిర్వహించే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షలను కరోనా కారణంగా రద్దు చేయడం జరిగింది.

మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు విద్యార్థుల ప్రాణాల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం అంటూ మండిపడుతున్నారు.ఇలాంటి తరుణంలో తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి సురేష్ రాజమహేంద్రవరం ఎంపీ భరత్ తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన పరీక్షల విషయంలో విపక్షాలు అనవసర రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.ఏది ఏమైనా టెన్త్ ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతామని తెలిపారు.
కరోనా వైరస్ తీవ్రత రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన వెంటనే పరీక్షల తేదీలు .ప్రకటిస్తామని, విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షల విషయంలోప్రభుత్వానికి పూర్తి సహకారం గా ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు.