సినిమాల్లో నటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం

సినీ ఇండస్ట్రీ లో నెంబర్ వన్ స్టార్స్ గా రాణించిన పలువురు ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో కూడా తమకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిన వారు చాలా మందే ఉన్నారు.

అయితే రాజకీయాల్లో రాణించిన వారు కూడా అప్పుడప్పుడు వెండితెర పై తళుక్కు మన్న వాళ్ళు కూడా లేకపోలేదు.

అయితే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి వెండితెర పై మెరవనున్నట్లు తెలుస్తుంది.ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యం తెలిపేలా తెరకెక్కిస్తున్న అమృత భూమి అనే తెలుగు సినిమా లో ఆమె నటిస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమాలో ఓ టీచర్ పాత్రలో కనిపించనున్నారు.మరో అధికారి పాత్రలో కలెక్టర్ జవహర్‌లాల్ కూడా కనిపించనున్నట్లు సమాచారం.

ఈ మూవీకి సంబంధించి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఆవరణలో జరిపిన షూటింగ్‌‌లో ఆమె టీచర్‌గా నటించిన సన్నివేశాన్ని షూట్ చేశారు.దీనికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం బయటకు వచ్చాయి.

Ap Deputy Cm Pushpa Sri Vani Acting In Amrutha Bhoomi Movie
Advertisement
Ap Deputy Cm Pushpa Sri Vani Acting In Amrutha Bhoomi Movie-సినిమా�

  దీనితో డిప్యూటీ సీఎం సినిమా ల్లో నటిస్తున్న విషయం స్ఫష్టం గా అర్ధం అవుతుంది.అయితే ఈ చిత్రం అంతా కూడా వ్యవసాయ బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రం సాగనున్నట్లు తెలుస్తుంది.మొత్తానికి డిప్యూటీ సీఎం ఈ చిత్రం ద్వారా వెండితెర కు పరిచయం అవుతున్నారు.

మరి ఈ చిత్రం ఆమెకు ఎలాంటి పేరును సంపాదించి పెడుతుందో అన్న విషయం ఈ చిత్రం విడుదల అయిన తరువాత తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు