యూసీసీ బిల్లును తాము వ్యతిరేకిస్తామని సీఎం హామీ ఇచ్చారు - ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష

ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష. యూసీసీ అంశంపై మూడు గంటల పాటు సీఎం సమావేశమయ్యారు.

యూసీసీ బిల్లు తెస్తున్నారనే సమాచారంతో దేశవ్యాప్తంగా ముస్లింలలో అభద్రతా భావం నెలకొంది.యూసీసీ వల్ల ముస్లింలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయం మత పెద్దలు సీఎంకు తెలిపారు.

మైనార్టీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం తెలిపారు.ముస్లింలకు నష్టం జరగకుండా తాను ముందుండి పోరాడతానని సీఎం హామీ ఇచ్చారు.

ముస్లింలు ఎవరూ అభద్రతకు గురికావద్దని, అధైర్యపడవద్దని సీఎం వెన్నుతట్టి అభయమిచ్చారు.యూసీసీ పై డ్రాఫ్ట్ కూడా రాలేదని సీఎం తెప్పారు.

Advertisement

ముస్లింలకు నష్టం కల్గేలా ఉంటే పార్లమెంట్ లో యూసీసీ బిల్లును తాము వ్యతిరేకిస్తామని సీఎం హామీ ఇచ్చారు.మైనార్టీలకు తాను అండగా ఉంటానని సీఎం హామీ ఇచ్చారు.

సీఎం నిర్ణయంతో మత పెద్దలు సంతోషం వ్యక్తం చేశారు.దేశ ఔనత్యానికి విఘాతం కల్గించేలా ఉంటే బిల్లును తప్పకుండా అడ్డుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.

ముస్లింలు ఎవరూ అధైర్యపడవద్దని కోరుతున్నా.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు