రెండు నెలలలో లోక్ సభ రద్దు అంటున్న.. ఏపీ కాంగ్రెస్ నేత చింత మోహన్..!!

దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు( Early Elections ) రాబోతున్నాయని జాతీయ పార్టీలకు చెందిన కీలక నాయకులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

మోడీ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు చెప్పుకొస్తున్నారు.

ఇదే సమయంలో జాతీయస్థాయిలో విపక్షంలో ఉన్న ప్రధాన పార్టీలు "ఇండియా"( INDIA ) అనే కూటమిగా ఏర్పడటం తెలిసిందే.మూడోసారి కూడా అధికారంలోకి రావడానికి బీజేపీ పక్క వ్యూహాలతో ఉంది.

అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ( Congress Party ) కర్ణాటకలో గెలవడంతో.బీజేపీ ఘోరంగా ఓటమి చెందడంతో దేశంలో విపక్ష పార్టీలో గెలిచే అవకాశాలు ఉన్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి.

పరిస్థితి ఇలా ఉంటే కేంద్ర మాజీ మంత్రి ఏపీ కాంగ్రెస్ నేత చింతా మోహన్( Chinta Mohan ) సంచలన వ్యాఖ్యలు చేశారు.రెండో నెలలో లోక్ సభ( Lok Sabha ) రద్దు ఖాయమని వ్యాఖ్యానించారు.

Advertisement

నవంబర్ లేదా డిసెంబర్ లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.త్వరలోనే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయని జోస్యం చెప్పారు.

ఆ దిశగా కేంద్రం అడుగులు వేయబోతున్నట్లు పేర్కొన్నారు.ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీజేపీ పై ప్రజలు వ్యతిరేక భావనతో ఉన్నారని స్పష్టం చేశారు.

అందుకే ఎక్కడో తేడా కొట్టే అవకాశం ఉందన్న ఆందోళనలో ఎన్డీఏ ఉందని తెలిపారు.ఈ క్రమంలో మోడీ ప్రభుత్వం నవంబర్ లేదా డిసెంబర్ లో లోక్ సభను రద్దుచేసి ఎన్నికలకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చింతా మోహన్ స్పష్టం చేశారు.

పవన్ ను వదిలిపెట్టని ప్రకాష్ రాజ్.. మరోసారి సెటైర్లు 
Advertisement

తాజా వార్తలు