2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్. ఈ మేరకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ , జనాల్లో పార్టీ ,ప్రభుత్వ ప్రతిష్ట పెరిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే భారీ ఎత్తున అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించామని, మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే ఆ సంక్షేమ పథకాలు నిరాకటంకంగా కొనసాగుతాయని జగన్ పదే పదే చెబుతున్నారు.దీంతో పాటు తమ రాజకీయ ప్రత్యర్థులైన జనసేన ,బిజెపి, టిడిపిలను ఒంటరిగానే ఎదుర్కొని తన సత్తా చాటుకోవాలని చూస్తున్నారు.
అలాగే పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు, ఎన్నికల్లో తిరుగులేకుండా చేసుకునేందుకు ఏం చేయాలనే విషయంపై నేడు సీఎం జగన్ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జగనన్న సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు రాష్ట్ర కోఆర్డినేటర్లు , జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్ సమీక్ష నిర్వహించబోతున్నారు.తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుంది.

ఈ సమావేశానికి అందరూ తప్పకుండా హాజరు కావాలని వైసిపి కేంద్ర కార్యాలయం నిన్ననే ప్రకటన చేసింది.పార్టీ నిర్దేశిత ఫార్మెట్ లో ‘ గృహసారదులుగా నియమితులైన వారి తుది జాబితాను ఎమ్మెల్యేలు , సమన్వయ కర్తలు ఈ సమావేశంలో తప్పనిసరిగా సమర్పించాలని పేర్కొంది.ఇక ఈ సమావేశంలో జగన్ కీలక ప్రసంగమే చేయనున్నారు 2024 ఎన్నికల్లో మళ్లీ పార్టీ గెలవాలంటే ఏం చేయాలనే దానిపైన జగన్ అనేక సూచనలు చేయబోతున్నారు.

ముఖ్యంగా తమ రాజకీయ ప్రత్యర్థులంతా ఏకమై మనల్ని ఎదుర్కొనేందుకు వస్తున్నారని , అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైన అసత్య ఆరోపణలు చేస్తూ జనాల్లోకి తీసుకువెళుతున్నారని, వాటిని ఏ విధంగా తిప్పుకొట్టాలని విషయం పైన జగన్ దిశ నిర్దేశం చేయబోతున్నారట.క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వ పరంగా సంక్షేమ పరకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారంతా వైసిపి కే ఓటు వేసే విధంగా ఒప్పించాలని జగన్ ఈ సమావేశంలో సూచించబోతున్నారట ఇంకా అనేక అంశాలకు సంబంధించి జగన్ ప్రసంగం ఉండబోతుందడం తో పార్టీ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది.