ఇంగ్లాండ్‌ లైబ్రరీలో తెలంగాణ హిస్టరీ బుక్స్.. ఆ వివరాలు ఇవే..

బ్రిటన్‌లో నివసిస్తున్న తెలంగాణ వ్యక్తి సురేశ్‌ గోపతి తెలంగాణ చరిత్రను, సంస్కృతిని తెలియజేసే పుస్తకాలను ప్రపంచంలోని 50 ప్రముఖ లైబ్రరీలకు చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇందులో భాగంగా తాజాగా అతను తెలంగాణ చరిత్రను వివరించే 25 పుస్తకాలను లండన్‌లోని బ్రిటిష్‌ రాయల్‌ లైబ్రరీలో చేర్చారు.

 Telangana History Books In England Library , Biography Of Former Pm Pv Narasimha-TeluguStop.com

వీటిని లైబ్రరీలో చేర్చడం ద్వారా వేలాదిమంది తెలంగాణ చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది.

హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో జన్మించిన సురేశ్‌ గోపతి తెలంగాణ చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకున్నారు.మహోత్తరమైన చరిత్ర గల తెలంగాణ గురించి తనలాగే అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో అతను ఇలా పుస్తకాలను అన్ని సెంట్రల్ లైబ్రరీలలో చేర్చుతున్నారు.50 దేశాల్లోని సెంట్రల్‌ లైబ్రరీలలో రాష్ట్ర చరిత్ర పుస్తకాలను చేర్చాలని సురేశ్‌ గోపతి లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇంగ్లాండ్‌తో పాటు ఇప్పుడు నాలుగు దేశాల లైబ్రరీలలో తెలంగాణ చరిత్ర పుస్తకాలను యాడ్ చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.

Telugu Biographypm, Britishroyal, England, London, London Libraby, Nri, Suresh G

సురేశ్‌ గోపతి 2001లో కొలువు కోసం లండన్‌ వెళ్లారు.ఆపై అక్కడ సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెంట్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.అయితే అక్కడ పనిచేస్తున్నా తెలంగాణ ఉద్యమంపైనే మనసు ఉండింది.

దాంతో అతను అక్కడే ఉండి తెలంగాణ ఎన్నారై కమ్యూనిటీతో కలిసి బ్రిటన్‌లోని ఇండియన్ ఎంబసీ ఆఫీస్ ఎదుట తెలంగాణకు సపోర్టుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.ఎన్నో ఉద్యమాల తర్వాత తెలంగాణ ఏర్పాటు అయ్యింది.

ఆ చరిత్ర లండన్ లో పుట్టిన తన పిల్లలతో సహాయం ఇతరులకు ఎలా తెలుస్తుంది, ఎలా తెలియజేయాలి అని సురేష్ ఆలోచించారు.చివరికి సమగ్ర తెలంగాణ చరిత్రను పుస్తకాలను సెంట్రల్ లైబ్రరీలో చేర్చితే తెలంగాణ చరిత్ర తెలుసుకోవడం సులభతరం అవుతుందని అనుకున్నారు.

Telugu Biographypm, Britishroyal, England, London, London Libraby, Nri, Suresh G

అయితే గతేడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌కు వచ్చి తిరిగి వెళ్లేటప్పుడు ఆయన 4 సెట్ల తెలంగాణ చరిత్ర పుస్తకాలు (100 పుస్తకాలు), మాజీ పీఎం పీవీ నరసింహారావు జీవిత చరిత్ర, ఆయన రచనలకు సంబంధించిన ఒక సెట్‌ (10 పుస్తకాలు) కలెక్ట్ చేశారు.వాటన్నిటిని కొరియర్‌ ద్వారా బ్రిటన్‌కు సెండ్ చేశారు.అయితే కొరియర్‌ ఖర్చులు రూ.35 వేలు అయినట్టు తెలిపారు.విదేశాల్లో తెలంగాణ పుస్తకం కనబడితే తెలంగాణ ఎన్నారైలు వ్యక్తం చేసే సంతోషం విలువ కట్టలేనిదని, ఆ సంతోషం ముందు తను పెట్టే ఖర్చు చాలా తక్కువ అని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube