పాదయాత్ర ప్లాన్ లో ఏపీ బీజేపీ ! ఆ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా ?

పాదయాత్రలు అనేవి రాజకీయ పార్టీలకు,  నాయకులకు సర్వసాధారణ విషయంగా మారిపోయింది.పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనే సెంటిమెంటును గత కొంతకాలంగా రాజకీయ పార్టీలు పాటిస్తున్నాయి.

ఇప్పటికే ఏపీలో పాదయాత్ర చేపట్టి 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చారు.అంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర నిర్వహించారు ఆయన కంటే ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ద్వారానే ప్రజల్లోకి వెళ్లి అధికారంలోకి వచ్చారు.

  ఇక తెలంగాణలోనూ పాదయాత్ర సీజన్ మొదలైంది .ఇప్పటికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర చేపడుతుండగా,  కాంగ్రెస్ సైతం అదే ప్లాన్ లో ఉంది.ఇక వచ్చే నెలలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

      ఇది ఇలా ఉంటే,  ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు నుంచి కీలక ప్రకటన వెలువడింది .రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం బిజెపి పాదయాత్ర చేపడుతుందని సోము వీర్రాజు ప్రకటించారు.రాష్ట్రంలో ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లేదని,  ప్రభుత్వ నిర్ణయంతో రైతులు సతమతమవుతున్నారని ఆయన విమర్శలు చేశారు.

Advertisement

ఈ సందర్భంగా వైసిపి,  టిడిపిల పైన వీర్రాజు విమర్శలు చేశారు.ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాయని వీర్రాజు విమర్శించారు.ప్రస్తుతం ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్ లో ఉన్నాయి .ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు జనసేన సహకారంతో బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.  రెండు రోజుల క్రితం జరిగిన జనసేన ఆవిర్భావ సభ లోనూ బిజెపి నిర్ణయం మేరకే తాను నడుచుకుంటానని బిజెపి రోడ్ మ్యాప్ కోసం తాను ఎదురు చూస్తున్నాను అంటూ పవన్ ప్రశ్నించడంతో బిజెపిలో మరింతగా ధీమా పెరిగిపోయింది.   

     2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే విషయం క్లారిటీ రావడంతో బిజెపి నాయకుల్లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోంది.అయితే పవన్ టిడిపిని కూడా కలుపుకునేందుకు చూస్తుండడం పైనే బిజెపి నేతలు ఇబ్బందులు పడుతున్నారు.  అయితే మొత్తం వ్యవహారంలో తమను చిన్నచూపు చూస్తారనే భయమూ ఏపీ బిజెపి నాయకుల్లో ఉంది .అందుకే బీజేపీ గ్రాఫ్ పెంచుకునేందుకు ఇక నిరంతరంగా ప్రజా సమస్యలపై పోరాడాలని పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువ కావాలని , ఆ విధంగా అయినా బిజెపి ప్రాధాన్యాన్ని ఏపీలో పెంచుకోవాలని ఉద్దేశం ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది.

Advertisement
" autoplay>

తాజా వార్తలు