అసలు ఏపీలో బీజేపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది.ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని , తమ ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది.2019 ఎన్నికల సమయంలో వైసీపీ కి మద్దతుగా బిజెపి నిలిచింది అయితే ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో వైసీపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూనే వస్తోంది.తమతో పొత్తు పెట్టుకున్న జనసేన ను కలుపుకొని 2024 ఎన్నికల్లో వైసిపి, టిడిపిలకు ధీటుగా జనసేన , బిజెపి ప్రభుత్వాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఆ పార్టీ అగ్ర నాయకుల దగ్గర నుంచి ఏపీ నాయకుల వరకు ఉన్నారు.
దీనికి తగ్గట్లుగానే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే విశాఖ వచ్చిన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరాలంటూ అథవాలే కోరడం ఏపీ బీజేపీ నేతలకు మింగుడుపడడం లేదు.ఎన్ డి ఏ లో వైసీపీని చేరాల్సిందిగా కేంద్ర మంత్రి ప్రకటన చేసి వెళ్లిపోయారు.
అయితే దాని పర్యవసానం మాత్రం తీవ్రంగా ఉండడంతో బిజెపి నేతలు టెన్షన్ పడుతున్నారు .ఒకవైపు వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అలాగే కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎనికలలో వైసీపీ అభ్యర్థి కి పోటీగా బిజెపి అభ్యర్థిని నిలబెట్టామని, కనీసం గెలవక పోయినా , డిపాజిట్లు దక్కించుకుని పరువు కాపాడుకోవాలని చూస్తున్న సమయంలో, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ప్రకటన అందర్నీ గందరగోళంలో పడేసింది అనే ఆగ్రహంతో వారంతా ఉన్నారు.ప్రస్తుతం జనసేన పార్టీతో బీజేపీ కలిసి వెళ్తున్నా, రెండు పార్టీల మధ్య సఖ్యత అంతంతvమాత్రంగానే ఉంది.దీంతో పవన్ చాలాకాలం నుంచి బీజేపీ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు అనే విషయం ఆ పార్టీ నేతలకు బాగా తెలుసు.

ఆయన ఏదో రకంగా 2024 ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేసి సత్తా చాటాలనే అభిప్రాయంతో బిజెపి నేతలు ఉన్నారు.ఇప్పుడు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే చేసిన ప్రకటన కారణంగా బీజేపీ పై పవన్ కు మరింత ఆగ్రహం పెరుగుతుందని , వైసీపీ నిజంగానే బీజేపీకి దగ్గరవుతుంది అనే భావనతో బీజేపీకి ఆయన పూర్తిగా దూరమైతే, ఏపీలో బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ఆందోళన ఏపీ బీజేపీ నేతల్లో ఉంది.అసలు ఇప్పటికిప్పుడు ఎన్డీఏ లోకి వైసీపీ ని చేయాల్సిందిగా కేంద్రమంత్రి ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చింది అనే విషయంపై ఏపీ బిజెపి నేతలు చర్చించుకుంటున్నారు.ఈ వ్యవహారంపై కేంద్ర బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేయాలని , ఇకపై ఏపీకి కేంద్ర మంత్రులు ఎవరు వచ్చినా, ఏ విధమైన ప్రకటన చేయకుండా కట్టడి చేయాలనే డిమాండ్ ను అధిష్టానం పెద్దల వద్ద పెట్టాలి అని చూస్తున్నారట.