వైసిపి రహిత పాలన ఆంధ్రప్రదేశ్ కందించాలని బలంగా కోరుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తెలుగు దేశం అదినేత చంద్రబాబు నాయుడుతో( Chandrababu Naidu ) మరొకసారి భేటీ అయ్యారు .ప్రాథమికంగా పొత్తు ఉండాలని ఇరు పార్టీల అధినాయకులు కోరుకుంటున్నప్పటికీ , పొత్తుల పీటమూడి అంత తేలిగ్గా తెగదని తెలిసిన విషయమే .
ప్రభుత్వ వ్యతిరేకతను ఎట్టి పరిస్థితుల్లోనూ చీల్చమని సంవత్సరం క్రితం పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే ఇరు పార్టీల పొత్తు దాదాపు కన్ఫామ్ అయ్యింది.అయితే గడిపిన సంవత్సరకాలంగా తెలుగుదేశం పార్టీ( TDP ) సంస్థాగతం గా బాగా బలపడిందని వార్తలు వస్తున్నాయి .ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు సీట్లను కూడా ఆ పార్టీ గెలుచుకోగలిగింది దీని ద్వారా ఆ పార్టీ ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అయినట్లుగా తెలుస్తుంది .

ఒంగోలులో జరిగిన ఆ పార్టీ ఆవిర్భావ సభ కు జనం పోటెత్తడంతో ఈసారి విజయం తమదే అంటూ తెలుగు తమ్ముళ్లు కూడా మానసికంగా ఫిక్స్ అయిపోయారు.ఇప్పుడు పొత్తులో జనసేన కి( Janasena ) భారీ సంఖ్యలో సీట్లు ఇస్తే మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన ఎమ్మెల్యేలను గెలుచుకోవడం కష్టమవుతుందని ఆ పార్టీ వ్యూహకర్తలు లెక్కలేస్తున్నారట.అయితే పవన్ కళ్యాణ్ మద్దతు లేకుండా కూడా ముందుకు వెళ్లడం ప్రస్తుత పరిస్థితుల్లో రిస్కు తీసుకున్నట్టు అవుతుందని కూడా ఆ పార్టీ భావిస్తుంది.
పొత్తును పలప్రదం చేసుకుంటూనే తక్కువ సీట్ల కు జనసేన ను ఒప్పించడమే ఇప్పుడు ఆ పార్టీ ముందున్న భారీ సవాలనితెలుస్తుంది.

అయితే తమ సామాజిక వర్గం సంఖ్యాపరంగా బలంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి స్థానం అందలేదని ఈసారి పవన్ కళ్యాణ్ తో ఆ లోటు తీరుతుందని ఆ సామాజిక వర్గం భావిస్తున్నట్లుగా హరిరామ జోగయ్య లాంటి వారి వ్యాఖ్యల వల్ల తెలుస్తుంది మరి తక్కువసేట్లకు జనసేన ని ఒప్పుకుంటే ఆ సామాజిక వర్గం నుంచి వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉంది.కచ్చితంగా పవర్ సెంటర్ కావాలని తమ మద్దతు తో ప్రభుత్వం నిలిచే అవకాశం ఉండాలని జనసేన ని భావిస్తున్నారు దానికోసం కచ్చితంగా 50కు పైగా ఎమ్మెల్యే సీట్లను ఆయన దక్కించుకోవలసి ఉంటుంద.….మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరి భేటీ ఏం తేలుస్తుందో పొత్తు పొడుస్తుందో లేదో చూడాలి.