మీకు బాధ్యత లేదా ? ఏపీ బీజేపీ నేతలెక్కడ ? 

ఏపీ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది.

ఒకవైపు ఆక్సిజన్ కొరత మరోవైపు, ఆస్పత్రులలో బెడ్ లు దొరక్క, ఇంకోవైపు ఫ్యాక్షన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది.

ఈ సమయంలో ఏపీ సీఎం జగన్ ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా, ఆక్సిజన్,  వాక్సిన్ కొరత వంటి విషయాల్లో కేంద్రం దయ దాక్షిణ్యాల పై ఆధారపడాల్సి రావడం వంటివి జగన్ కు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.అయితే కేంద్ర అధికార పార్టీ బిజెపి రాజకీయ కోణంలో కొన్ని కొన్ని రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోంది అనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

ముఖ్యంగా కరోనా నిబంధనలు కాని,  ఇతర అంశాలలో రాష్ట్రాల మీదే భారం అంతా అన్నట్లుగా కేంద్రం చేతులు దులిపేసుకుంది.ప్రపంచవ్యాప్తంగా భారత్ లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇతర దేశాలు ఇప్పుడు భారత్ ను కరోనా విషయంలో నిందించే పరిస్థితి రావడానికి , కేంద్రం మెతకవైఖరి కారణం అనేది అందరి అభిప్రాయం.ఇక ఏపీలో కరోనా పరిస్థితిని అదుపు చేయడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని ప్రతిపక్షం టీడీపీ జనసేన బీజేపీ వంటి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.

Advertisement

టిడిపి విషయం పక్కనపెడితే,  ఇప్పుడు ఏపీ బిజెపి నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పుడు ఏపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో బీజేపీ నాయకులు కేంద్రంతో మాట్లాడి ఏపీ కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సి ఉన్నా, అవేమి తమకు పట్టనట్టుగా వ్యవహరించడం, మొత్తం ఏపీ ప్రభుత్వం తప్పు అన్నట్టుగా విమర్శలు చేస్తుండడంతో జనాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

మొన్నటి వరకు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలను పురస్కరించుకుని బిజెపి ఏపీ నేతలంతా అక్కడే మకాం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు .ఇక్కడ బిజెపి ఎంపీ అభ్యర్థి గెలిపిస్తే ఏపీకి ఎన్నో చేస్తామంటూ హామీలు ఇచ్చారు.అయితే అక్కడ జనాలు వైసీపీ ని గెలిపించడం తో ఏపీ బీజేపీ నేతలంతా సైలెంట్ అయిపోయారు.

విమర్శలు చేయడానికి తప్పితే, కరోనా కు సంబంధించి ఏపీకి అవసరమైన సహాయం కేంద్రం నుంచి వచ్చే విధంగా కృషి చేయడంలో ఏపీ బీజేపీ నేతలంతా మౌనంగా ఉండిపోతున్నారు.ఏపీకి అవసరమైన ఆక్సిజన్ ను సరఫరా చేయాల్సి ఉండగా, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కానీ , ఆ పార్టీ నాయకులు కానీ ఎవరు ముందుకు రావడం లేదు.

  కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం లో చూపించే శ్రద్ధ , రాష్ట్రానికి మేలు చేసే విషయంలో చూపించకపోవడం వంటివి బిజెపి తీరుపై విమర్శలు అర్థమయ్యేలా చేస్తున్నాయి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 

ఇక జనసేన విషయంలోనూ ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం అవుతోంది బిజెపికి మిత్రపక్షంగా ఉన్న పవన్ ఈ క్లిష్ట సమయంలో యాక్టివ్ గా ఉండడమే కాక,  బీజేపీ పై ఒత్తిడి పెంచి రాష్ట్రానికి మేలు జరిగేలా చూసే బాధ్యత ఉన్నాా , కేవలం తాము విమర్శలు మాత్రమే చేస్తాము అన్నట్లుగా ఏపీ బిజెపి నాయకులు జనసేన వ్యవహరిస్తుండడం విమర్శల పాలవుతోంది. .

Advertisement

తాజా వార్తలు