టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది.
యాత్రలో పాల్గొన్న నటుడు నందమూరి తారకరత్న స్పృహ తప్పి పడిపోవడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
టిడిపి నేత లోకేష్ పాదయాత్రలో అస్వస్థతకు గురైన సినీ నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
సినీనటి మాజీ ఎంపీ జమున మృతి చెందారు.
విద్యార్థులు ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసం నింపేందుకే పరీక్షా పే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు పోలీసులు నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చారు.
తెలంగాణ గవర్నర్ తమిళ సై ను అవమానపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది.సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకులు శ్రీవాణి ఈ ఫిర్యాదు చేశారు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఈరోజు కుప్పం నుంచి ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా టిడిపి నేత అప్పలనాయుడు ఉత్తరాంధ్ర నది జలాలను తీసుకొచ్చి లోకేష్ కు సంఘీభావం తెలిపారు.
సినీనటి మాజీ ఎంపీ జమున నూతన ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ తన సంతాపం తెలియజేశారు.
ఖమ్మం జిల్లా పాలేరులో నవోదయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థత కు గురయ్యారు.ఫుడ్ పాయిజన్ కావడమే దీనికి కారణం.
బదిలీలు
నేటి నుంచి తెలంగాణలో టీచర్ల పదోన్నతులు బదిలీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించనున్నారు.రేపటి నుంచి ఈనెల 31 వరకు బదిలీల కోసం ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
రేపు తిరుమలలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.ఎస్ ఎస్ డి టోకెన్లు, వీఐపీ బ్రేక్ , ఆర్జిత సేవలను రద్దు చేసింది.అలాగే నేడు, రేపు అడ్వాన్స్ డ్ వసతి గదులు కేటాయింపును టీటీడీ రద్దు చేసింది.
ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం మొబైల్ యాప్ ను టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి విడుదల చేయనున్నారు .మొబైల్ యాప్ ద్వారా టిటిడి కి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని భక్తులు తెలుసుకోవచ్చని టీటీడీ తెలిపింది.
నేటి నుంచి రెండు రోజులపాటు గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన పీ ఏ సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నారు.
విజయనగరం రాజీవ్ మైదానంలో నేటి నుంచి రాష్ట్ర స్థాయి కోకో పోటీలు జరగనున్నాయి.
టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 5న మహారాష్ట్రలోని నాదెండ్ లో బీఆర్ ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లనున్నారు.
ఒరిస్సా మాజీ సీఎం గిరిధర్ ఘమాంగ్ కెసిఆర్ సమక్షంలో నేడు బీఆర్ఎస్ లో చేరనున్నారు.
మరాఠా వీరుడు చత్రపతి శివాజీ 13వ వారసుడు సాహు మహారాజ్ మనవడు కొల్లాపూర్ సంస్థాన వారసుడు , స్వరాజ్ ఉద్యమకారుడు మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజే కెసిఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు.
కాళోజి నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కి అనుబంధంగా ఉన్న ప్రైవేట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీలలో 2022 - 23 విద్యాసంవత్సరానికి ఎండి హోమియో కోర్సుల్లో ప్రవేశానికి AIAPGET 2022 అర్హత పొందిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
టిడిపి నేత నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర పై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు .కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ అసమర్ధుడని ఆయన పాదయాత్ర చేస్తే టిడిపి అధికారంలోకి వచ్చే సీన్ ఉందా అంటూ నాని ప్రశ్నించారు.
వైద్య ఆరోగ్యశాఖ పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మార్చి ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు కాబోతున్నట్లు జగన్ ప్రకటించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy