న్యూస్ రౌండప్ టాప్ 20

1.సినీ నటుడు సుమన్ కామెంట్స్

ఏపీలో బీసీల కోసం కొత్తగా రాజకీయ పార్టీ రావాల్సి ఉందని, ఏపీలో బీసీలకు రక్షణ లేదని సినీ నటుడు సుమన్( Actor Suman ) అన్నారు.

గుంటూరు జిల్లా పెదకాకానిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గౌతు లచ్చన్న విగ్రహాన్ని టిడిపి మహిళా నేత గౌతు శిరీష తో కలిసి ప్రారంభించిన సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

2.సింగర్ మంగ్లీ కి గాయం

తెలంగాణ బోనాలను పురస్కరించుకుని ఓ ప్రైవేట్ సాంగ్ షూట్ చేస్తున్న సమయంలో సింగర్ మంగ్లీ( Singer Mangli ) జారి పడడంతో ఆమె కాలుకు గాయం అయింది.వెంటనే మంగ్లీని ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం కోలుకుంటున్నట్లు యూనిట్ తెలిపింది.

3.నేటి నుంచి ఏపీలో రెండు పూటలా బడులు

ఈరోజు నుంచి ఏపీలో రెండు పూటలా బడులు నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.

4.తెలంగాణలో లులూ గ్రూప్ పెట్టుబడులు

తెలంగాణలో 3,500 కోట్లకు పెట్టుబడులు  పెట్టనున్నామని లు గ్రూప్ ప్రకటించింది.

5.ఉప్పల్ స్కై వాక్ ప్రారంభం

హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ లో నిర్మించిన స్కై వాక్( Uppal Skywalk ) ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

6.మహారాష్ట్రకు వెళ్లిన కేసీఆర్

టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) మహారాష్ట్ర పర్యటనకు రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు.

7.తాడేపల్లిలో నాగదేవత విగ్రహాలు

గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో సీతానగరం ప్రకాశం బ్యారేజీతో చేసిన నాగదేవత విగ్రహాలు వెలుగుచూసాయి .దాదాపు 50 ప్రతిమలను ఇక్కడ కుప్పగా గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.

8.నేడు పలు రైళ్లు రద్దు

ఖరగ్ పూర్ సెక్షన్ బహనాగ బజార్ స్టేషన్ వద్ద ట్రాక్ నిర్వహణ పనులు కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేరు సీనియర్ డిసిఎం త్రిపాటి తెలిపారు.

9.మంత్రి మల్లారెడ్డి కామెంట్స్

ఖబడ్దార్ కాంగ్రెస్.కేసీఆర్ ఒక్క మాట అన్న ఊరుకునేది లేదు అని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి( Minister MallaReddy ) హెచ్చరించారు.

10.జేపీ నడ్డా పై మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శలు

సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( JP Nadda ) చేసిన ఆరోపణలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు.నడ్డా ఇది కేసీఆర్ అడ్డా నోరు అదుపులో పెట్టుకో బిడ్డ అంటూ హెచ్చరించారు.

11.పవన్ కళ్యాణ్ కామెంట్స్

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కీలక వ్యాఖ్యలు చేశారు.విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు జనాలకు చాలా అవసరం అని, ఈ మూడు కొద్ది మంది చేతుల్లోకి వెళ్లి మిగతా వాళ్ళు దేహి అనే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతోనే జనసేన ను స్థాపించానని పవన్ కళ్యాణ్ అన్నారు.

12.ఢిల్లీకి జగ్గారెడ్డి

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.రేపు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi )తో ఆయన భేటీ కానున్నారు.

13.బిజెపి ఎంపీ మృతి

బిజెపి రాజ్యసభ సభ్యుడు హరిద్వార్ దూబే మృతి చెందారు.

14.విశాఖలో విమానం ఎమర్జెన్సీ లాండింగ్

Advertisement

ఢిల్లీ పోర్ట్ బ్లేయర్ విమానం విశాఖలో ఎమర్జెన్సీ లాండింగ్ అయింది.

15.నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.

16.పవన్ పై అంబటి విమర్శలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) విమర్శలు చేశారు.రోత స్టార్,  బూతు స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ రాంబాబు విమర్శలు చేశారు.

17.కురుపాం పర్యటనకు జగన్

వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ ఈనెల 28న కురుపాం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

18.అనంతపురంలో టిడిపి బస్సు యాత్ర వాయిదా

అనంతపురం జిల్లాలో భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర వర్గ విభేదాలు కారణంగా వాయిదా పడింది.

19.నోట్ల రద్దు పై విహెచ్ విమర్శలు

2000 నోట్లు రద్దు పై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు విమర్శలు చేశారు.ఇది మోడీ ప్రభుత్వం తీసుకున్న తుగ్లక్ చర్య అంటూ వీహెచ్ మండిపడ్డారు.

20.ఈరోజు బంగారం ధరలు -

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 54,360 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 59, 280 .

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు