News Roundup: న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఏపీలో లాయర్ల విధులు బహిష్కరణ

 

తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు న్యాయమూర్తులతో సహా మొత్తం ఏడుగురు జడ్జిలను బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది.

ఈ క్రమంలోనే హైకోర్టు జడ్జీలు జస్టిస్ బట్టు దేవానంద్ , జస్టిస్ డి రమేష్ బదిలీ అయ్యారు.దీనిని నిరసిస్తూ ఏపీ హైకోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. 

2.విజయనగరంలో చంద్రబాబు పర్యటన ఖరారు

 

ఉమ్మడి విజయనగరం జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు మూడు రోజులు పర్యటన ఖరారు అయింది.డిసెంబర్ 8, 9, 10 తేదీల్లో ఆయన పర్యటించనున్నారు. 

3.మంత్రి పై క్రిమినల్ కేసు

  కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశిస్తూ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. 

4.హైకోర్టులో బిజెపి లంచ్ మోషన్ పిటిషన్

 

తెలంగాణలో టిఆర్ఎస్ కొనుగోలు కేసులో సిట్ నోటిఫికేషన్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ బిజెపి దాఖలు చేసింది. 

5.చిత్తూరు ఎస్పీపై డిజిపి కి వర్ల రామయ్య లేఖ

  చిత్తూరు ఎస్పీ ప్రశాంత్ రెడ్డి అధికార దుర్వినియోగంపై బీజేపీకి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య లేఖ రాశారు. 

6.ఉద్యోగాలు దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్

 

Advertisement

ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ వర్తింపజేసేందుకు సాధ్యసాధ్యానాలు తెలిసేందుకు నిపుణులు కమిటీ ఏర్పాటు చేసినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కే.స్టాలిన్ ప్రకటించారు. 

7.తిరుమల సమాచారం

 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.స్వామివారి దర్శనం కోసం నేడు ఏడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 

8.ఆన్లైన్ రమ్మీ నిషేధంపై వివరణ కోరిన గవర్నర్

 

ఆన్లైన్ రమ్మీ నిషేధ చట్టం వ్యవహారంలో మరింత వివరణ కావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ రవి కోరారు. 

9.ఋషి కొండ లో నారాయణ

  ఋషికొండలో సిపిఐ నారాయణ పర్యటించారు.ఈ సందర్భంగా రిషికొండలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు.ప్రకృతిని నాశనం చేసే విధంగా చేయడం క్షమించరానిదంటూ నారాయణ కామెంట్ చేశారు.

10.బీజేపీ లోకి మర్రి శశిధర్ రెడ్డి

  ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సీనియర్ పొలిటిషన్ మర్రి శశిధర్ రెడ్డి నేడు బిజెపిలో చేరనున్నారు. 

11.కృష్ణ సంస్మరణ సభ

 

ఇటీవల మృతి చెందిన సినీ సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ సభను తెనాలిలోని కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేశారు. 

12.నేడు రీజినల్ రింగ్ రోడ్డుపై ప్రజాభిప్రాయ సేకరణ

  నేడు రీజనల్ రింగ్ రోడ్డు పై ప్రజాభిప్రాయ సేకరణ ను మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామంలో స్వీకరించనున్నారు .ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

13.అంగన్వాడి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు

  నేటి నుంచి మూడు రోజులపాటు గుంటూరులో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. 

14.చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్

    బాపట్ల సంతమాగులూరు లో బాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో స్పెషల్ నిర్వహించనున్నారు. 

15.అంగ ప్రదక్షణ టోకెన్లు విడుదల

 

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

తిరుమలలో ఈరోజు ఆన్లైన్ లో అంగప్రదక్షిణ టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. 

16.పిఎస్ఎల్వి సీ 54 కు కౌంట్ డౌన్

 

Advertisement

రేపు ఉదయం 11.56 గంటలకు పిఎస్ఎల్వీ సీ 54 రాకెట్ ను ప్రయోగించనున్నారు. 

17.చంద్రబాబు మళ్ళీ సీఎం కాలేడు

 

చంద్రబాబు మళ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కాలేడు అని సిపి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 

18.బడ్జెట్ సమావేశానికి హాజరైన ఏపీ ఆర్థిక మంత్రి

  వచ్చే ఏడాది ప్రవేశపెటనున్న బడ్జెట్ పై కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది.దీనిలో భాగంగా ఢిల్లీలో ఫ్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు.

19.జగన్ సమీక్ష

  పురపాలక పట్టణ అభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సురేష్ హాజరయ్యారు. 

20.జీ20 అఖిలపక్ష సమావేశానికి జగన్

 

భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జి20 దేశాల సదస్సును విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ కు ఆహ్వానం అందింది.       .

తాజా వార్తలు