తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) విమర్శలు చేశారు.
రాష్ట్ర సమస్యలు, అభివృద్ధి కోసం కేటీఆర్ ఢిల్లీ కి వెళ్లలేదని ఐటీ దాడుల నుంచి రక్షణ పొందేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళారని దీనికి సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు రోజులపాటు మహారాష్ట్ర( Maharashtra )లో పర్యటించనున్నారు.ఈనెల 26 ,27 తేదీల్లో ఆయన పర్యటన ఉండబోతోంది.
జనసేన పార్టీతో బిజెపి పొత్తు కొనసాగుతుందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు.
రాబోయే రోజుల్లో పక్క రాష్ట్రాలకు మెడిసిన్ ఎగుమతి చేస్తామని తెలంగాణ మంత్రి హరీష్ రావు( Telangana Minister Harish Rao ) అన్నారు.
కుల రాజకీయాలతో వ్యవస్థ నాశనం అవుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.ప్రస్తుతం పవన్ వారాహి యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్దరాజు వార్నింగ్ ఇచ్చారు.వర్మ తీస్తున్న వ్యూహం సినిమాలో సోనియా గాంధీని కించపరిచే విధంగా చూపిస్తే వర్మని బట్టలూడదీసి కొడతామని హెచ్చరించారు.
బిజెపికి ప్రజలతో మాత్రమే పొత్తు ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు( BJP Somu Veerraju ) అన్నారు బిజెపి చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రశ్నించే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా అని సవాల్ చేశారు.
ఉదయగిరి వైసిపి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఛాలెంజ్ చేశారు.2024 ఎన్నికల్లో దమ్ముంటే నెల్లూరు సిటీ నుంచి తనతో పోటీ పడాలని, ఒకవేళ తాను ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అనిల్ కుమార్ సవాల్ చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర( Pawan Kalyan Varahi Yatra ) ఈ రోజుకు 11వ రోజుకు చేరుకుంది.ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు మలికిపురం కాలేజీ సెంటర్లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ జరగనుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది.
నేడు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది .ఈ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
నేడు సిద్దిపేట జిల్లాలో తెలంగాణ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు.నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
నాగర్ కర్నూల్ కు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( BJP JP Nadda ) రానున్నారు.బీజేపీ నవ సంకల్ప సభలో ఆయన పాల్గొననున్నారు.
నేడు మెదక్ జిల్లాలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పర్యటించనున్నారు.
త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను అందించే ప్రక్రియను ప్రస్తుతానికి చైర్మన్ అల్లం నారాయణ( Allam Narayana )కు అప్పగించామని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు కాంగ్రెస్( Congress Senior Leaders ) పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు.
కేంద్ర మంత్రి అమిత్ శాతం తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ కాలేదు.ముందుగా తీసుకున్న అపాయింట్మెంట్ బిజీగా ఉండడంతో రద్దయింది.
హలో ఏపీ బై బై వైసిపి ఇదే మన నినాదంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) మంత్రి రోజా తనదైన సైనిలో సెటైర్లు వేశారు.హాయ్ ఏపీ బై బై బిపి (బాబు, పవన్ కళ్యాణ్ ) అంటూ సెటైర్ లు వేశారు.
అభివృద్ధిపై దమ్ముంటే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) చర్చకి రావాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 54,250 24 క్యారెట్ల అనుగ్రహం బంగారం ధర - 59180.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy