వారిద్దరికి వేరే దారి కనిపించడం లేదా..?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్,( Etela Rajender ) కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( Komatireddy Rajagopal Reddy ) పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.వీరిద్దరు బిజెపిని( BJP ) వీడే అవకాశం ఉందని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో కాషాయ అధిష్టానం వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

 Etela Komatireddy Does Not See Any Other Way Details, Bjp Etela Rajender, Komati-TeluguStop.com

ఈ ఇద్దరు నేతలు దారి తప్పకుండా ఓ కంట కనిపెడుతూనే ఉంది.ఇక తాజాగా ఈ ఇద్దరి నేతలతో డిల్లీ పెద్దలు బేటీ అయిన సంగతి తెలిసిందే.

ఈటెల, కోమటిరెడ్డి పార్టీ మారే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో డిల్లీ పెద్దలు ఈ ఇద్దరికి ఎలాంటి సూచనలు చేశారు.ఈటెల, కోమటిరెడ్డి డిల్లీ పెద్దల ముందు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టారు.

అనే అంశాలు పోలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Telugu Bandi Sanjay, Cm Kcr, Delhi Bjp, Komatirajagopal, Mlc Kavitha, Telangana

ప్రధానంగా రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీ స్థితిగతులపై బీజేపీ అధిష్టానం ఈటెల, కోమటిరెడ్డి లతో చర్చించినట్లు తెలుస్తోంది.ఇక కే‌సి‌ఆర్ పాలనపై, డిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పై చర్చలు తీసుకోవాలనే ప్రతిపాదను వీరిద్దరు డిల్లీ పెద్దల ముందు ఉంచినట్లు సమాచారం .అయితే బేటీ అనంతరం కూడా నేతల్లో ఎలాంటి జోష్ కనిపించలేదు.దీంతో బీజేపీపై ఈటెల, కోమటిరేడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం వీరిద్దరు పార్టీ మారే ఆలోచనలో ఉన్నప్పటికి, వేరే దారి లేక తప్పక బీజేపీలో కొనసాగుతున్నట్లు వీరిద్దరి తీరును చూస్తే ఇట్టే అర్థమౌతోంది.

బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత బీజేపీలో చేరిన ఈటెలకు బి‌ఆర్‌ఎస్ లో లభించినంతా ప్రదాన్యత కాషాయ పార్టీలో లభించడం లేదనేది బహిరంగ వాస్తవం.

Telugu Bandi Sanjay, Cm Kcr, Delhi Bjp, Komatirajagopal, Mlc Kavitha, Telangana

అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా కాంగ్రెస్ లో లభించినంత ప్రదాన్యత ప్రస్తుతం బీజేపీలో లేదు.అందుకే విలువ లేని చోట ఉండడంవల్ల మరింత విలువను పోగొట్టుకోవడమే అని భావనకు ఈ ఇద్దరు నేతలు వచ్చినట్లు తెలుస్తోంది.అయితే వీరిద్దరు బీజేపీని వీడడం వల్ల కాషాయ పార్టీ కంటే వివిద్దరికే ఎక్కువ నష్టం అనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.ఎందుకంటే ఏ పార్టీలోనూ ఈ ఇద్దరు ఇమడలేరనే భావనా ప్రజల్లో కలిగే అవకాశం ఉంది.అదే భావన ప్రజల్లో ఏర్పడితే.

ఎన్నికల్లో ఇద్దరు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.అందుకే ప్రస్తుతం బీజేపీలో ఉండలేక.

వేరే పార్టీ మారలేక ఇద్దరు సతమతమౌతున్నారని తెలుస్తోంది.మరి ముందు రోజుల్లో ఈ ఇద్దరి దారి ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube