న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఫిలిం ఛాంబర్ ముందు నిర్మాతల ఆందోళన

నేడు ఫిలిం చాంబర్ ముందు నిర్మాతలు ఆందోళన చేయనున్నారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ కమిటీ తీర్పు నిరసనగా ఈ ఆందోళన చేపట్టనున్నారు. 

2.నేడు టిటిడి బోర్డు సమావేశం

  నేడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరగనుంది.శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించనున్నారు. 

3.నేడు విజయవాడలో సిపిఎం సభ

 

నేడు విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో బహిరంగ సభ జరగనుంది జింఖానా గ్రౌండ్స్ లో దేశ రక్షణ పేరుతో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.ఈ సభకు సీతారాం ఏచూరి హాజరుకానున్నారు. 

4.బిజెపి స్టీరింగ్ కమిటీ భేటీ

  మునుగోడు అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు బిజెపి మునుగోడు స్టీరింగ్ కమిటీ భేటీ కానుంది. 

5.గుడివాడలో అమరావతి రైతులు

 

అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర నేడు గుడివాడ  చేరుకోనుంది. 

6.నేడు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్లు

  నేటి నుంచి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 

7.నేడు రేపు వర్షాలు

 

Advertisement

నేడు రేపు ఏపీలో పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 

8.తెలంగాణ వ్యాప్తంగా ఆసుపత్రులలో తనిఖీలు

  తెలంగాణ వ్యాప్తంగా ఆస్పత్రులలో అధికారులు దానికి నిర్వహించారు.నల్గొండ లో ఆరు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు అందజేశారు. 

9.కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై కఠిన చర్యలు

 

ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.రంగారెడ్డి డీఏం హెచ్ ఓ స్వరాజ్యలక్ష్మి,  డిసిహెచ్ఎస్ ఝాన్సీ లక్ష్మీలపై బదిలీల వేటు వేసింది. 

10.రేపు సైబరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

  ఈనెల 25న కేథరిన్ సైక్లింగ్ కమ్యూనిటీ  మారథాన్ సందర్భంగా సైబరాబాద్ లో ఉదయం 5 నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసరావు తెలిపారు. 

11.జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ నుంచి సభ్యుల తొలగింపు

 

జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న సభ్యులపై పాలకమండలి చర్యలు తీసుకుంది.జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ మేనేజింగ్ కమిటీకి చెందిన 11 మందిని జేఐసి నుంచి తొలగించింది.ఈ మేరకు జేఐసి అధ్యక్షుడు సివి రావు ఒక ప్రకటన చేశారు. 

12.ఆర్టీసీ ఉద్యోగులకు 5.7 శాతం డీఏ

   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 5.7% డిఏ పెంచుతూ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి సర్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. 

13.ఇంజినీరింగ్ ఫీజుల పై నేడు కమిటీ సమావేశం

 

తెలంగాణలో ఇంజనీరింగ్ కోర్సు ఫీజులను ఖరారు చేసే అంశంపై ఈ రోజు కీలక సమావేశం జరగనుంది. 

14.రోబోలతో యాంజియో ప్లాస్టి

  అత్యధిక రోబో అసిస్టెడ్ ఇంటర్వెవేషనల్ కార్డియాలజీ విధానాలను దేశంలో తొలిసారిగా తెలంగాణ ఏపీలో అందుబాటులోకి తెచ్చినట్లు హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి చెందిన హుద్రోగ నిపుణులు వెల్లడించారు. 

15.కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తా

 

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

జైల్లో తిన్న చిప్పకుడు సాక్షిగా తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. 

16.సల్మాన్ కుర్షిత్ తో రేవంత్ షబ్బీర్ భేటీ

  కాంగ్రెస్ సీనియర్ నేత, న్యాయవాది సల్మాన్ కుర్షితో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,  మాజీ మంత్రి షబ్బీర్ అలీ భేటీ అయ్యారు. 

17.గుడివాడలో పోలీసుల ఆకస్మిక ఆంక్షలు

 

Advertisement

అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర గుడివాడ లో జరగనున్న నేపథ్యంలో పోలీసులు ఆకస్మిక ఆంక్షలు విధించారు. 

18.చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు

  ఏలూరు సమీపంలోని దుగ్గిరాలలో టిడిపి నేత చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు .అమరావతి రైతుల పాదయాత్ర కు వెళ్ళకూడదు అని ఆంక్షలు విధించారు . 

19.బాలకృష్ణ కామెంట్స్

 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చిన వ్యవహారంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు.ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలు ఉన్నారు.పీతలు ఉన్నారు.విశ్వాసం లేని వాళ్ళని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి సునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అంటూ బాలకృష్ణ ఫైర్ అయ్యారు. 

20.అమరావతి పాదయాత్రకు 5 లక్షల విరాళం

  అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు టిడిపి నేత పిన్నమనేని బాబ్జి ఐదు లక్షల రూపాయలు విరాళం అందించారు.

తాజా వార్తలు