న్యూస్ రౌండప్ టాప్ 20

1.కడప జిల్లా పర్యటనకు జగన్

  సెప్టెంబర్ 1,2 తేదీల్లో ఏపీ సీఎం జగన్ కడప జిల్లా పర్యటనకు వెళ్ళనున్నారు.

 

2.భారత్ లో కరోనా

 

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,677 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

3.డీకే అరుణ పై షర్మిల కామెంట్స్

  బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కామెంట్స్ చేశారు.డీకే అరుణ కాదు కేడి అరుణ అంటూ మండిపడ్డారు. 

4.బొంతు రామ్మోహన్ పై అట్రాసిటీ కేసు నమోదు

 

టీఆర్ఎస్ నేత, మాజీ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. 

5.ఈటెల ను పరామర్శించిన పొన్నం ప్రభాకర్

 

Advertisement

బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తండ్రి మల్లయ్య మృతి చెందడం పై కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. 

6.ప్రజా సంగ్రామ యాత్ర అపేదే లేదు : బండి సంజయ్

  ప్రజాసంఘ్రమయాత్రను ఆపే ప్రసక్తే లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. 

7.జూనియర్ ఎన్టీఆర్ పై లక్ష్మి పార్వతి కామెంట్స్

  జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని టిడిపిని స్వాధీనం చేసుకోవాలని తెలుగు సంస్కృతి అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి తిరుపతి మీడియా సమావేశంలో అన్నారు. 

8.ఈనెల 28న సిడబ్ల్యుసి సమావేశం

 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసినందుకు ఈనెల 28న కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార కమిటీ అయినా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అవుతోంది. 

9.సీపీఎస్ ఎంప్లాయీస్ చలో విజయవాడ

  కంటిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని సిపిఎస్ ఉద్యోగులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టనున్నారు. 

10.చీమకుర్తి లో ఏపీ సీఎం జగన్ పర్యటన

 

ప్రకాశం జిల్లా చీమకుర్తి లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. 

11.నేడు నితీష్ కుమార్ సర్కార్ బలనిరూపణ  పరీక్ష

  బీహార్ రాజకీయాల్లో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.నితీష్ కుమార్ ప్రభుత్వం బల నిరూపణ పరీక్షకు సిద్ధమైంది. 

12.కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ అరెస్ట్

 

కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులు పోలీసులు ఈ అరెస్ట్ చేశారు. 

13.బండి సంజయ్ నిరసన దీక్ష ప్రారంభం

  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన దీక్ష కొనసాగుతోంది.టిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు, అరాచక దాడులు , నిరంకుశ నిర్బంధాలకు పాల్పడుతోందని బిజెపి ఆరోపిస్తోంది. 

13.ఢిల్లీ చేరుకున్న తెలంగాణ గవర్నర్

 

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

తెలంగాణ గవర్నర్ తమిళ సై ఢిల్లీ చేరుకున్నారు.ప్రధాని మోదీ కేంద్ర హోం శాఖ మంత్రి ని ఆమె కలిసే అవకాశం ఉంది. 

14.నేడు ఢిల్లీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. 

15.నేడు సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా

 

Advertisement

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసిన బిజెపి నేతలపై ఎమ్మెల్సీ కవిత నేడు సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. 

16.అమితాబచ్చన్ కు కరోనా

  బాలీవుడ్ ప్రముఖ నటుడు బిగ్ బి అమితాబచ్చన్ మరోసారి కరోనా బారిన పడ్డారు. 

17.నేడు హైదరాబాద్ కు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి

 

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నేడు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ హైదరాబాద్ కు రానున్నారు. 

18.సెప్టెంబర్ 1 నుంచి టాలీవుడ్ లో షూటింగులు

  టాలీవుడ్ సినిమా షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది.సెప్టెంబర్ ఒకటి నుంచి షూటింగ్స్ ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలుగు నిర్మాతల మండలి ప్రకటించింది. 

19.తిరుమలలో భారీ వర్షం

 

అల్పపీడన ప్రభావంతో తిరుమలలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,250   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -51,550.

తాజా వార్తలు