న్యూస్ రౌండప్ టాప్ 20

1.అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు భూపాలపల్లి విద్యార్థులు

  అంతర్జాతీయ ఓపెన్ కిక్ బాక్సింగ్ పోటీలకు భూపాలపల్లి విద్యార్థులు ఎంపికయ్యారు.

 

2.యాదాద్రి సన్నిధిలో లక్ష దీపోత్సవం

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

యాదాద్రిలో కార్తీక మాసం తొలి రోజైన బుధవారం (ఈ నెల 26వ తేదీన ) లక్ష దీపోత్సవం నిర్వహణకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

3.పవన్ కళ్యాణ్ కు అమిత్ షా ట్వీట్

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలుగులో ట్వీట్ చేశారు.శనివారం అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా జనసేన ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయగా,  దానికి బదులుగా  పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు అంటూ అమిత్ షా రీ ట్వీట్ చేశారు. 

4.మోడీ ప్రభుత్వానికి సరుకు లేదు : కేటీఆర్

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold
Advertisement
Telangana Headlines, News Roundup, Top20News, Telugu News Headlines, Todays Gold

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కు సరుకు లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు. 

5.అమిత్ షాకు చంద్రబాబు ఫోన్

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్ చేశారు.ఈ సందర్భంగా అమిత్ షా కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 

6.టిడిపితో పొత్తు పెట్టుకోము

  తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రసక్తే లేదని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ థియేధర్ తెలిపారు. 

7.కోమటిరెడ్డి వెంకటరెడ్డి షోకాజ్ నోటీసులు

 

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలు లీక్ కావడంతో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. 

8.తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ యాత్ర

 

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది.ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు రాహుల్ కు ఘన స్వాగతం పలికారు. 

9.భారత్ లో కరోనా

  గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 1,994 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

10.తలసానిని కలిసిన డీవియే స్కూల్ విద్యార్థి తల్లితండ్రులు.

విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?

  డీవియే స్కూల్ విద్యార్థి తల్లితండ్రులు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు.ఈ దాడికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు మంత్రిని కోరారు. 

11.రైతుల యాత్ర కాదు .బినామీల యాత్ర

 అమరావతి రైతుల యాత్రపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన విమర్శలు చేశారు.అది రైతుల పాదయాత్ర కాదని బినామీల యాత్ర అంటూ ఎద్దేవా చేశారు. 

12.తెలంగాణ ప్రభుత్వం పై షర్మిల కామెంట్స్

  తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది.

Advertisement

ఈ సందర్భంగా కెసిఆర్ ప్రభుత్వం పై షర్మిల కామెంట్స్ చేశారు.దళిత బందు కాస్త అనుచరుల బంద్ చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.  13.

మునుగోడు ప్రచారానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు

మునుగోడులో అసెంబ్లీ ఒక ఎన్నికల సందర్భంగా బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరఫున ప్రచారం చేసేందుకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈనెల 31వ తేదీన రానున్నారు. 

14.కర్ణాటక డిప్యూటీ స్పీకర్ మృతి

 

కర్ణాటక డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మామాణీ తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. 

15.మంత్రి ధర్మాన కామెంట్స్

 విశాఖకు రాజధాని వస్తే ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారుతుంది అని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 

16.వచ్చే ఏడాది చంద్రయాన్ 3

  వచ్చే ఏడాది చంద్రయాన్ 3 ని ప్రయోగించనున్నట్టు ఇస్రో చైర్మన్ సొమ్ నాథ్ వెల్లడించారు. 

17.ఓపెన్ స్కూల్ అడ్మిషన్ డ్రైవ్

  తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 2022-2023 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి, ఇంటర్మీడియెట్ స్కూళ్ల ల్లో ప్రవేశాలకు గాను అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. 

18.జానా రెడ్డి ఆగ్రహం

 

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రచారాన్ని అడ్డుకోవడం పై మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

19.చెప్పులు ధరించనంటూ మంత్రి శపథం

 

మళ్లీ కేసీఅర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు తాను చెప్పులు ధరించనని మంత్రి సత్యవతి రాథోడ్ శపథం చేశారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

 

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,010

 

24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -  51,290

       .

తాజా వార్తలు