న్యూస్ రౌండప్ టాప్ - 20

1.రాష్ట్రపతిని కలిసిన సోనియా

 

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో ఈ రోజు భేటీ అయ్యారు.

 

2.బీజేపీ నేతల పై పరువు నష్టం దావా వేసిన కవిత

  ఢిల్లీ లిక్కర్ స్కాం లో తనపై ఆరోపణలు చేసిన బిజెపి నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా వేశారు. 

3.బిజెపి నేతలపై మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం

 

బిజెపి నేతలు మా జోలికి వస్తే రోడ్లమీద తిరగరని మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. 

4.లింగాల గన్ పూర్ లో బండి సంజయ్ అరెస్ట్

 తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు .ఢిల్లీ లిక్కర్ స్కాం లో టిఆర్ఎస్ పాత్ర పై నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బండి సంజయ్ పిలుపు ఇవ్వడం తో ముందస్తు జాగ్రత్తగా సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

5.ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

 

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు.వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలో రాజా సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

6.నక్సల్స్ మద్దతుదారులు లొంగుబాటు

  ఒడిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి జిల్లాలో  500 మంది మావోయిస్టు మద్దతుదారులు, సానుభూతిపరులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. 

7.ఫారెస్ట్ కాలేజీలో ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్

 

Advertisement

ములుగు లో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ కాలేజీలో 27 కోర్సుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 

8.ఎన్టిపీసీ కార్మికులపై లాఠీ చార్జి

  పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టిపీసీ కాంట్రాక్టు కార్మికులపై సీ ఐ ఎస్ ఎఫ్ జవాన్లు లాఠీ ఛార్జి చేశారు. 

9.26 పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయ పురస్కారం

 

స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డుకు తెలంగాణలోని 26 పాఠశాలలు ఎంపికయ్యాయి. 

10.హిల్ పోర్డ్ ప్యాలస్ అభివృద్ధికి 50 కోట్లు

  వారసత్వ స్మారక కట్టడం గా గుర్తింపు పొందిన హైదరాబాద్  ఆదర్శ్ నగర్ లోని హిల్ బోర్డ్ ప్యాలెస్ అభివృద్ధి సంరక్షణ చర్యల కోసం 50 కోట్లు మంజూరు చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. 

11.చోళుల శాసనాలను పరిశీలించిన ఆయుష్

చోళ రాజుల హయాంలో అల్లం బెల్లం తదితర ఆహార పదార్థాలపై పన్ను విధించినట్లుగా పేర్కొంటున్న శాసనాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఆయుష్ శాఖ బృందం నల్గొండ జిల్లా పానగల్ ఛాయా సోమశ్వరాలయాన్ని సందర్శించింది. 

12.బిజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు

 బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై బిజెపి అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. 

13.చిరుత సంచారం

 

శ్రీశైలం టోల్ గేట్ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. 

14.ఆడిటర్లకు వర్క్ అలాట్మెంట్ తగ్గింపు పై నిరసన

  ఆడిట్ శాఖలో సీనియర్ అడిటర్ల కు వర్క్ అలాట్మెంట్ తగ్గించి కొత్త విధానంలో ఏ ఏ వో లకు కేటాయించడం పై ఏపీ స్టేట్ ఆడిట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసిేషన్ నిరసన వ్యక్తం చేసింది. 

15.23 మంది ఆర్బీకే అసిస్టెంట్ల సస్పెన్షన్

 

చేపల చెరువుల్లో వరి పండించినట్లు ఈ క్రాఫ్ నమోదులో అవకతవకలకు పాల్పడినందుకు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 23 మంది ఆర్బికే అసిస్టెంట్ల ను జిల్లా కలెక్టర్ ప్రశాంతి సస్పెండ్ చేశారు. 

16.బండి సంజయ్ కు కేంద్రం నుండి ఫోన్ కాల్

  లిక్కర్ స్కాం వ్యవహారం లో కేసీఆర్ కుమార్తె కవిత కు సంబంధం ఉందని ఆరోపిస్తూ బిజెపి శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు కేంద్రం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. 

17.తెలంగాణపై కేంద్రానికి జగన్ విజ్ఞప్తి

 

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

తెలంగాణ డిస్కం లో నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం కు ఆదేశాలు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 

18.వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ డబ్బులు

  వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ డబ్బులు ఇవ్వబోతున్నామని టీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు చెప్పారు. 

19.నేడు కృష్ణ నదీ యాజమాన్య బోర్డ్ సమావేశం

 

Advertisement

నేడు కృష్ణ నదీ యాజమాన్య బోర్డు సమావేశం నేడు జరిగింది. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,000   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 51,230.

తాజా వార్తలు