న్యూస్ రౌండప్ టాప్ 20

1.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై హైకోర్టులో విచారణ

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ పై మంగళవారం హైకోర్టు లో విచారణ మొదలయ్యింది.

2.హైకోర్టు సమీపంలో ఎగిరిన డ్రోన్

మద్రాస్ హైకోర్టుపై డ్రోన్ ఎగిరిన వ్యవహారంలో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

3.బెంగళూరు వేలాంగిని మధ్య ప్రత్యేక రైలు

వేసవి రద్దీ నేపథ్యంలో మైదుకూరు రైల్వే జోన్ పరిధిలోని బెంగళూరు డివిజన్ వేళాంగణికి ప్రత్యేక రైలు నడపాలని దక్షిణ మధ్య రైల్వే  నిర్నయించింది.

4.పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి కి హైకోర్టు హెచ్చరిక

చారిత్రక కట్టడం గా గుర్తింపు పొందిన హీల్ ఫోర్డ్ ప్యాలస్ పునరుద్ధరణ విషయంలో అధికారులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.హిల్ ఫోర్డ్  భవన నిర్మాణాలను పరిశీలించి అధ్యయన నివేదికను ఇవ్వాలన్న తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్ జస్టిస్ తుకారాంజి ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

5.ఆదివాసీయుల ఆవేదన

మమ్మల్ని అడవిలోకి వెళ్లనివ్వడం లేదని ఆదివాసీలు  తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు భట్టి విక్రమార్కకు తమ ఆవేదనను తెలియజేశారు.

6.తిరుమల సమాచారం

తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు శ్రీవారి టిక్కెట్లను ఆన్లైన్ లో విడుదల చేయనుంది.

7.నేను ఆరోగ్యంతోనే ఉన్నా :  కోట శ్రీనివాసరావు

Advertisement

కోటా శ్రీనివాసరావు మరణించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.ఈ వ్యవహారంపై కోట శ్రీనివాసరావు స్పందించారు.తాను బతికే ఉన్నానని ఆరోగ్యంగానే ఉన్నానంటూ ఆయన అన్నారు.

8.ఋషికొండను తనిఖీ చేసిన కేంద్ర కమిటీ

వివాదాస్పదమైన ఋషికొండ రిసార్ట్ పునరుద్ధరణ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి.ఋషికొండలో అక్రమ తవ్వకాలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు హైకోర్టు సూచన మేరకు కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులతో నియమించిన కమిటీ కొద్ది రోజుల క్రిందట ప్రాజెక్టును గోప్యంగా పరిశీలించింది .

9.ఆసిఫాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు

తెలంగాణలోని కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో స్వల్ప భూకంపం సంబంధించింది.జిల్లాలోని కౌటాల , బెజ్జూరు, చింతల మానేపల్లి మండలాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది.

10.బండి సంజయ్ పై మంత్రి విమర్శలు

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

11.మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ప్రభుత్వాలు మా ఫోన్లను హ్యాక్ చేస్తున్నాయని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.

12.ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత

తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కు నిరసనగా ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ఏబీవీపీ కార్యకర్తలు తరలివచ్చారు.

13.ఆదాని వ్యవహారంపై విపక్షాల ఆందోళన

గౌతమ్ ఆదాని హెడెన్ బగ్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు  ఆందోళన చేయడంతో లోక్ సభ, రాజ్య సభ ను రెండు గంటల వరకు వాయిదా వేశారు.

14.డీజీపీ కి రాజాసింగ్ లేఖ

తనకు ఎనిమిది నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని,  లైసెన్స్ గన్ ఇప్పించాలని డిజిపి అంజనీ కుమార్ కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు.

15.జగన్ పై యనమల కామెంట్స్

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

సీఎం జగన్ పై ఏపీ శాసనమండలి లో విపక్ష నేత యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.నేరగాళ్లకు దేవుడు మొట్టికాయలు వేస్తాడని నేరగాళ్లే అనడం విడ్డూరం అంటూ ఎద్దేవా చేశారు.

16.బట్టి విక్రమార్క పాదయాత్ర

అదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్ర ఆరో రోజుకు చేరుకుంది.ఈరోజు పాదయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు.

17.పాఠశాల విద్యార్థులకు రాగిజావ పంపిణీ

Advertisement

ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు నుంచి పాఠశాల విద్యార్థులకు రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.

18.టీటీడీ కి లోకేష్ విరాళం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా టీటీడీ ఒక్క రోజు అన్న ప్రసాద వితరణ నిమిత్తం 33 లక్షల విరాళాన్ని లోకేష్ దంపతులు టిటిడికు అందించారు.

19.శేషాద్రి ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం

శేషాద్రి ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది.నెల్లూరు జిల్లా బిట్రగుంట స్టేషన్ వద్ద ఏసీ కోచ్ కు హాట్ యాక్సిల్ అయ్యింది.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 55,000 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 60,000.

తాజా వార్తలు