న్యూస్ రౌండప్ టాప్ - 20

1.నేషనల్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు

నేషనల్ ఏరోస్పేస్ లేబరేటరీస్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

 

2.వేలానికి తిరుమల స్వామి వారి వస్త్రాలను

   తిరుమల శ్రీవారి కి భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను వేలం వేయాలని నిర్ణయించారు.

మరిన్ని వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయాన్ని సంప్రదించాలని దేవస్థానం అధికారులు తెలిపారు.అలాగే 08772264429 నంబర్ కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని దేవస్థానం అధికారులు తెలిపారు. 

3.యోగా కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ : మోది

 

గత కొన్నేళ్లుగా యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. 

4.కొండా సురేఖ వ్యాఖ్యలు

  రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో,  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకురాలు మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. 

5.ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ కు 14 రోజుల కస్టడీ

 

Advertisement

నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ను 14 రోజులపాటు జుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. 

6.తెలంగాణలో మూడు రోజుల్లో వర్షాలు

  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు రోజుల్లో వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 

7.భారత్ లో కరోనా

 

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 8,084కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

8.సిపిఐ నారాయణ సంచలన కామెంట్స్

  భూ సమస్యలు పరిష్కారం కాకపోతే తుపాకులు చేపడతామని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

9.ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులు

 

ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దామని , గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టిన సీఎంకు కృతజ్ఞతలు అని ఆమె అన్నారు. 

10.రేపు సత్యసాయి జిల్లాలో జగన్ పర్యటన

  శ్రీ సత్య సాయి జిల్లాలో రేపు ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు.ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయ్యింది. 

11.  నేడు తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు

 

నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. 

12.కేంద్రమంత్రి జయశంకర్ పర్యటన

  నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా లో కేంద్రమంత్రి జయశంకర్ పర్యటిస్తున్నారు.పాడేరు ఏజెన్సీలో జయశంకర్ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు, కాపీ ప్లాంటేషన్ పనులను పరిశీలిస్తారు. 

13.తెలంగాణలో నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం

 

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

తెలంగాణలో నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి.సెలవులను పొడిగించేదే లేదు అని విద్యాశాఖ ప్రకటించింది. 

14.మహారాష్ట్ర సీఎం ను కలిసిన మేజర్ టీం?

  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ను మేజర్ సినిమా  యూనిట్ మర్యాదపూర్వకంగా కలిసింది. 

15.టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల కారుపై దాడి

 

Advertisement

గుంటూరు జిల్లా అనుమర్లపూడి లో టిడిపి మాజీ ఎమ్మెల్యే పొన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి దూళిపాళ్ల నరేంద్ర కారుపై దాడి జరిగింది .ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. 

16.భారత్ సైబర్ దాడులు.70 వెబ్ సైట్లు హ్యాక్

  భారత్ లో ప్రభుత్వ ప్రైవేటు వెబ్సైట్ల పై సైబర్ దాడులు మొదలయ్యాయి.దాదాపు 70 వెబ్సైట్లను హ్యాక్ చేసినట్లు సమాచారం. 

17.టిఆర్ఎస్ కెసిఆర్ పై రఘునందన్ రావు ఆగ్రహం

 

తెలంగాణ ఏర్పడితే 8 ఏళ్లు అయినా గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయలేదని, కానీ ప్రధానమంత్రిని బీజేపీ నాయకులను తిట్టడమే పనిగా టిఆర్ఎస్ నాయకులు , కెసిఆర్ పెట్టుకున్నారని బిజెపి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. 

18.బషీర్ బాగ్ ఈడి కార్యాలయం వద్ద కాంగ్రెస్ నిరసన

 కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న నేపథ్యంలో టిపిసిసి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా బషీర్ బాగ్ ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నిరసనకు దిగింది. 

19.అచ్చెన్నాయుడు కామెంట్స్

 

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టిడిపి పోటీ చేయడం లేదు.దీనిపై వైసిపి నాయకులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అచ్చెన్నాయుడు స్పందించారు.టిడిపి గత సాంప్రదాయాన్ని పాటించింది కాబట్టే ఈ పోటీకి దూరంగా ఉందని ప్రకటించారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 48,360   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,760.

తాజా వార్తలు