News Roundup: న్యూస్ రౌండప్ టాప్ 20

1.  రాజకీయాలకు దూరంగా ఉన్నా : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు. 

2.తుఫానుపై జగన్ సూచనలు

  తుఫానుపై అప్రమత్తంగా ఉండాలని ఏపీలోని అన్ని జిల్లా కలెక్టర్లకు ఏపీ సీఎం జగన్ సూచించారు.ఎప్పటికప్పుడు తుఫాను ప్రభావం పై సమీక్ష చేసుకుంటూ, కింది స్థాయి అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. 

3.చిరుతపులి కలకలం

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

జగిత్యాల జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.రాయికల్ మండలం వస్తాపూర్ అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది. 

4.కమల్ హాసన్ పిలుపు

  లోక్సభ ఎన్నికలు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన పూర్వ అనుభవంతో గెలుపు దిశగా వ్యూహ రచన చేస్తూ , వచ్చే లోక్ సభ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించాలని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

5.తిరుమల సమాచారం

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

తిరుమలలో భక్తులు రద్దీ సాధారణంగా ఉంది.స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు నాలుగు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. 

6.ప్రత్యేక హోదాపై పురందరేశ్వరి కామెంట్స్

  ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురందరేశ్వరి ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు . 

7.తీన్మార్ మల్లన్న పాదయాత్రకు హైకోర్టు అనుమతి

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold
Advertisement

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాదయాత్ర చేసుకునేందుకు హైకోర్టు అనుమతించింది. 

8.రైల్వే పెన్షన్ అదాలత్

  విశ్రాంత రైల్వే ఉద్యోగుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో డిసెంబర్ 15న పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజాసంబంధాల అధికారి సిహెచ్ రాకేష్ తెలిపారు. 

9.సిపిఐ చలో రాజ్ భవన్ ఉద్రిక్తం

 

కేంద్రం చేతులు గవర్నర్ వ్యవస్థ కీలుబొమ్మలా మారిందని దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడి  ఉద్రిక్తతలకు దారితీసింది. 

10.జాతీయ పార్టీగా ఆమ్ ఆద్మీ

 ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్ర సృష్టించింది.జాతీయ పార్టీ హోదాను దక్కించుకుంది. 

11.పార్టీ నాయకులతో నేడు జగన్ సమీక్ష

 

తమ పార్టీ నేతలతో ఈరోజు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ సమావేశం నిర్వహించబోతున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు 175 నియోజకవర్గాల పరిశీలకులు జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లతో క్యాంప్ ఆఫీసులో జగన్ భేటీ కానున్నారు. 

12.చంద్రబాబు పర్యటన

 టిడిపి అధినేత చంద్రబాబు ఈరోజు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. 

13.వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు

 

నేటి నుంచి మూడు రోజులపాటు జంగారెడ్డిగూడెంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ పోలిట్ బ్యూరో సభ్యురాలు మాజీ ఎంపీ బృందాకా హాజరు కానున్నారు. 

14.నేడు మిజోరాం గవర్నర్ రాక

  నేడు నగరానికి మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు రానున్నారు.వారం రోజులపాటు ఏపీ తెలంగాణలో ఆయన పర్యటించనున్నారు. 

15.కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన

 

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025

టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. 

16.షర్మిల బీజేపీ వదిలిన బాణమే

  వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల బిజెపి వదిలిన బాణమైననని తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 

17.ఏఐసీసీ కార్యాలయం నుంచి జగ్గారెడ్డికి పిలుపు

 

Advertisement

ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం నుంచి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డికి పిలుపు వచ్చింది. 

18.గుజరాత్ కొత్త సీఎంగా భూపేందర్ పటేల్

  గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఎన్నికయ్యారు. 

19.చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు

 

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఇవే చివరి ఎన్నికలని వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ అన్నారు  

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 49,500   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -54,000.

తాజా వార్తలు