తెలుగు ప్రేక్షకులకు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవల సాయి ధరంతేజ్ కారు యాక్సిడెంట్లో గాయపడిన విషయం తెలిసిందే.
సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం వార్త అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది అని చెప్పవచ్చు.దేవుడి దయవల్ల తేజ్ బతికి బయటపడ్డాడు.
ఆ తర్వాత ఆరు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నాడు సాయి ధరమ్ తేజ్.ఇప్పుడు పూర్తిస్థాయిలో కోల్పోవడంతో ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా ఉన్నాడు.
ఈ నేపథ్యంలోనే సాయి ధరంతేజ్ తాజాగా నటించిన చిత్రం విరూపాక్ష.
ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాను బివిఎన్ ప్రసాద్ తో కలిసి డైరెక్టర్ సుకుమార్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు.
ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రిలీజ్ అయినా ఈ గ్లింప్స్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.అలాగే ఇందులో చివర్లో సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది.
అయితే చాలామంది చివర్లో సాయి ధరమ్ తేజ్ ని చూడగానే గుర్తుపట్టలేకపోయారు.యాక్సిడెంట్ కి ముందు ఉన్న తేజ్ కి ఇప్పటికీ చాలా తేడా ఉంది అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా యాక్సిడెంట్ తర్వాత సాయి ధరంతేజ్ లో చాలా మార్పులు వచ్చాయి మొఖం మొత్తం పీక్కుపోయింది సన్నబడ్డాడు.విడుదలైన ఫస్ట్ లుక్ లో కూడా ఆ విధంగానే కనిపించడంతో మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే యాక్సిడెంట్ తర్వాత సాయి ధరంతేజ్ ఆ విధంగా మారిపోయాడా లేకపోతే సినిమా కోసం మారాడా అన్నది తెలియడం లేదు.సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా ఉన్నాడు.