న్యూస్ రౌండప్ టాప్ 20

1.నాగాలాండ్ సీఎంగా నెఫియూ రియో ప్రమాణ స్వీకారం

నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఎన్డిపిపి నేత నెఫియూ రియా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు.

2.మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం : కేటీఆర్

మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం , మరిన్ని సీఐఐ సదస్సులు నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.

3.భద్రాద్రిలో వసంతోత్సవ వేడుకలు

 భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంతోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈనెల 30 జరగనున్న సీతారాముల కల్యాణానికి  పౌర్ణమి సందర్భంగా ఈరోజు నుంచి స్వామి వారి పెళ్లి పనులను ఆలయ అర్చకులు ప్రారంభించారు.

4.లాలూ ను ప్రశ్నిస్తున్న సిబిఐ

ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో సిబిఐ చేపట్టిన విచారణ రెండో రోజు కూడా కొనసాగుతోంది.ఈరోజు ఆర్జెడ్ చీఫ్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ను సిబిఐ విచారిస్తోంది.

5.రేవంత్ కు బండి సంజయ్ కౌంటర్

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.గతంలో బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసింది ఎవరని ? ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బి.ఆర్.ఎస్ తో పొత్తు ఉంటుందని అనలేదా అని బండి సంజయ్ ప్రశ్నించారు.

6.లోకేష్ పై వైసీపీ ఎంపీ విమర్శలు

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు చేశారు.అంబానీ విమర్శించే స్థాయి  నీదా అంటూ ఎంపీ భరత్ లోకేష్ ను ప్రశ్నించారు .

7.కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై కేసు నమోదు

Advertisement

నల్గొండ టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ ను చంపుతానంటూ కాంగ్రెస్ నేత భవనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుధాకర్ తనయుడు డాక్టర్ సుహాస్ ఈ వ్యవహారంపై పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఎంపీ వెంకటరెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు.

8.ముస్లిం ప్రతినిధులతో లోకేష్ ముఖాముఖి

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో 37వ రోజు పాదయాత్ర నిర్వహిస్తున్న లోకేష్ ఈ సందర్భంగా ముస్లిం పెద్దలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

9.మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

తమిళనాడులో కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో , ఆయా ప్రాంతాల్లో కోవిడ్ పరీక్షలు పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

10.లోకేష్ పాదయాత్రలో వంగవీటి రాధా

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రలో నేడు విజయవాడ కీలక నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు.

11.శ్రీ చైతన్య కళాశాలకు శాశ్వత గుర్తింపు రద్దు

నార్సింగ్ లోని శ్రీ చైతన్య కళాశాల గుర్తింపును తెలంగాణ ఇంటర్ బోర్డు శాశ్వతంగా రద్దు చేసింది.

12.సింహాచలం నరసింహస్వామి సన్నిధిలో డోలోత్సవం

సింహాచలంలో వరలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో డోలోత్సవం నిర్వహించనున్నారు.

13.ఉమ్మడి అనంతపురం జిల్లా టిడిపి కార్యకర్తల సమావేశం

అనంతపురంలో ఈనెల 10న ఉమ్మడి అనంతపురం జిల్లా టిడిపి కార్యకర్తలు సమావేశం జరుగునుంది.ఈ కార్యక్రమానికి ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు హాజరుకానున్నారు.

14.తిరుమలలో ముగియనున్న శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు

తిరుమలలో నేటితో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ముగియనున్నాయి.ఈరోజు తెప్పలపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి విహరించనున్నారు.

15.ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలు జరుపునుంది.పిఆర్సి పెండింగ్ అంశాలతో పాటు , ఆర్థిక అంశాలపై మూడు ఉద్యోగాల సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ కానుంది.

16.ఢిల్లీ లిక్కర్ స్కాం లో హైదరాబాది అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్టాంప్ లో హైదరాబాద్ కు చెందిన అరుణ్ రామచంద్ర పెళ్లై అరెస్ట్ అయ్యారు.

17.ఉద్యోగులపై మమత సంచలన కామెంట్స్

Advertisement

కరువు బత్యం పెంపు కోసం రాష్ట్ర ఉద్యోగులు చేస్తున్న నిరసనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.మీరు తల తీసేసినా డీఏ మాత్రం పెంచలేను అంటూ వ్యాఖ్యానించారు.

18.నేను తెలంగాణ బిడ్డనే : పూనం కౌర్

సినీ పరిశ్రమలు తనని పంజాబీ అమ్మాయిలని వెలివేస్తున్నారని సినీనటి పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు .తాను తెలంగాణలో పుట్టిన బిడ్డనని , ఇక్కడే పెరిగానంటూ ఆమె కంటతడి పెట్టారు.

19.కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి : ఎర్రబెల్లి

తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 51,650 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 56,350.

తాజా వార్తలు