న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఖమ్మం సభకు ఇబ్బందులపై బీజేపీకి రేవంత్ ఫిర్యాదు

ఖమ్మం సభకు కాంగ్రెస్ కార్యకర్తలు ,ప్రజలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth reddy ) ఆయన ఫిర్యాదు చేశారు.

2.విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు

సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు విశాఖలో విధించారు.

3.సిపిఐ రామకృష్ణ విమర్శలు

దేశ ప్రజల మధ్య విభజన రేఖ గీయడానికి యూనిఫామ్ సివిల్ కోడ్ ను తీసుకువస్తున్నారని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ( Ramakrishna ) విమర్శించారు.

4.లోకేష్ పాదయాత్ర పై కాకాని విమర్శలు

లోకేష్( Nara lokesh ) పాదయాత్ర ఒక సర్కస్ కంపెనీ అని,  మీడియా కోసమే లోకేష్ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.

5.తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

6.బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ సమావేశం

కొమరం భీం జిల్లా కార్యదర్శి నగర్ లో నేడు బిజెపి మహాజన్ సంపత్ అభియాన్ సమావేశం ఏర్పాటు చేశారు.

7.నేడు ఏపీ ఈసెట్ ఫలితాలు

నేడు ఏపీ ఈసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ విడుదల చేయనున్నారు.

8.పత్తిపాడులో సుమన్

కాకినాడ జిల్లా పత్తిపాడులో పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో సినీ నటుడు సుమన్ పాల్గొన్నారు.

9.సన్నాహక సమావేశంలో కిషన్ రెడ్డి

నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా నేడు వరంగల్ లో జరిగే సన్నాహక సమావేశంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.

10.సింహాచలంలో నేడు

నేడు సింహాచలం అప్పన్న స్వామి గిరిప్రదక్షిణ జరగనుంది మధ్యాహ్నం రెండు గంటలకు ఈ యాత్ర ప్రారంభమవుతుంది.

11.దేవులపల్లి అమర్ విమర్శలు

ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్ టిడిపి పై విమర్శలు చేశారు .టిడిపి 27 ఏళ్లు పాలించినా ఎందుకు ఇంకా ఏపీ పేదరికంలో ఉంది అంటూ అమర్ ప్రశ్నించారు.

12.ఏపీ జేఏసీ అమరావతి లక్ష్యం ఇదే

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఏపీ జేఏసీ అమరావతి లక్ష్యమని ఏపీ జెఎసి అమరావతి.

13.కెసిఆర్ పై కోమటిరెడ్డి విమర్శలు

Advertisement

 ఖమ్మం కాంగ్రెస్ సభతో కేసీఆర్ కు భయం పట్టుకుందని, అందుకే జనాలు కాంగ్రెస్ సభకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.

14.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు

ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ జన గర్జన సభను ఫెయిల్ చేసేందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivasa Reddy ) విమర్శించారు.

15.ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ

బి.ఆర్ నేత తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు గోదావరి నది పరివాహక ప్రాంత బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.

16.తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

కెసిఆర్ పాలనపై ప్రజలు విసుగెత్తి పోయారని,  తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు.

17.సీతక్క విమర్శలు

ఖమ్మం కాంగ్రెస్ సభను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కుట్రలు పన్నుతోందని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి సీతక్క విమర్శించారు.

18.మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా అజిత్ పవార్

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు.

19.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

20.ఈరోజు బంగారం ధరలు

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -54,150

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 59,070

Advertisement

తాజా వార్తలు