న్యూస్ రౌండప్ టాప్ 20

1.తెలంగాణకు వర్ష సూచన

తెలంగాణలో రెండు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.

2.నేడు కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెందిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు నేడు కాంగ్రెస్ లో చేరనున్నారు.

3.ఏపీలో భారీ వర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం  పశ్చిమ బెంగాల్ ,ఒడిస్సా తీరాలకు సమీపంలో కొనసాగుతుండగా,  దాని ప్రభావంతో ఈరోజు ఏపీలోని కోస్తా తో పాటు , రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

4.నేటి నుంచి చంద్రబాబు విచారణ

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టిడిపి అధినేత చంద్రబాబును ఈరోజు నుంచి రేపటి వరకు సిఐడి అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ప్రశ్నించనున్నారు.

5.తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రద్దు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది.గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలు రద్దుచేసి మరోసారి నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

6.నటుడు నవదీప్ ను ప్రశ్నించనున్న నార్కోటిక్ పోలీసులు

మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ కు నార్కోటెక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఉదయం 11 గంటలకు పోలీసులు ముందు ఆయన హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.

7.హనుమంత వాహనంపై మలయప్ప స్వామి

Advertisement

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి .ఆరో రోజున ఉదయం హనుమంత వాహనంపై శ్రీ మల్లప్ప స్వామి భక్తులకు అభయం ఇచ్చారు.

8.భూమా అఖిలప్రియ నిరాహారదీక్ష భగ్నం

టిడిపి నేత , మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆమె రెండు రోజులుగా దీక్ష చేపట్టారు.

9.నందమూరి బాలకృష్ణ కామెంట్స్

టిడిపి అధినేత చంద్రబాబుపై ప్రభుత్వం కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టి మానసికంగా వేధిస్తుందని , న్యాయపోరాటంతో విజయం సాధిద్దామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.

10.తెలంగాణకు ప్రధాని

భారత ప్రధాని నరేంద్ర మోది అక్టోబర్ 2న తెలంగాణ కు రానున్నారు.

11.ఐటి జాబ్ మేళా

సూర్యాపేటలో ఈనెల 26న ఐటీ జాబ్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.

12.కొప్పుల హరీశ్వర్ రెడ్డి కన్నుమూత

వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీష్ రెడ్డి తండ్రి మాజీ ఉప సభాపతి కొప్పుల హరీష్ రెడ్డి (78 ) కన్నుమూశారు.

13.తెలంగాణలో డీఎస్పీల బదిలీ

తెలంగాణలో 9 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

14.ఎన్నికల్లోగా పిఆర్సి బకాయిలు చెల్లిస్తాం

ఎన్నికల కంటే ముందుగానే టీచింగ్ హాస్పిటల్ వైద్యుల 2016 పిఆర్సి బకాయిలు ఇస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వైద్యులకు హామీ ఇచ్చారు.

15.నేడు జెమిని ఎన్నికల కమిటీ తొలి సమావేశం

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

జెమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పరిచయ సమావేశం ఈరోజు జరగనుంది.

16.నల్ల బెలూన్స్ తో నిరసన

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ నేడు తెలంగాణ టిడిపి కార్యాలయం , ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద నల్లబెలున్లు ఎగురవేసి పార్టీ నాయకులు నిరసన తెలిపారు.

17.ఎన్డీఏలో చేరిన జెడిఎస్

Advertisement

కర్ణాటక కు చెందిన జనతా దళ్  సెక్యులర్ (జెడిఎస్) బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలియాన్స్ కూటమిలో చేరింది.

18.బెయిల్ పై వైయస్ భాస్కర్ రెడ్డి విడుదల

మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పై విడుదలయ్యారు.

19.ఇస్రో సమాచారం

చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు పూర్తయిన తర్వాత చంద్రయాన్ 3, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ స్లీపింగ్ మోడ్ లోకి వెళ్ళింది.ఇప్పుడు దానిని తిరిగి పని చేయించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

20.మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణమే అమలు చేయాలి

మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు