న్యూస్ రౌండప్ టాప్ 20

1.వైద్య ఆరోగ్య శాఖలో 13 వేల ఖాళీలు

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

త్వరలోనే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు.

 

2.తెలంగాణ మహారాష్ట్రల్లో మావోయిస్టుల అలజడి

 తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టుల అలజడి మొదలు కావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.దీంతో తెలంగాణ పోలీసులు కూంబింగ్ ప్రారంభించారు. 

3.తుఫాను బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

అసని తుఫాను బాధితులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. 

4.మాజీ మంత్రి నారాయణ అరెస్టు పై సజ్జల సంచలన కామెంట్స్

  పేపర్ లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ ను అరెస్టు చేస్తే విప్లవకారుడు ని అరెస్టు చేసినట్లుగా బిల్డప్ ఇస్తున్నారు అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి విమర్శించారు. 

5.సోము వీర్రాజు విమర్శలు

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

ఏపీలో విద్య వైద్యం అధ్వానంగా ఉన్నాయని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. 

6.ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

 

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold
Advertisement

అసని తుఫాను కారణంగా ఎపిలో ఈరోజు జరగవలసిన ఇంటర్ పరీక్షలను ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు. 

7.నేటి నుంచే గడపగడపకు ప్రభుత్వం  కార్యక్రమం

  నేటి నుంచి ఏపీలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

8.కర్నూలులో వీర్రాజు పర్యటన

 

కర్నూలు జిల్లాలో ఈరోజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా బీజేపీ ఆఫీస్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 

9.నేటి నుంచి సిటీ బస్ సర్వీసులు

  నేటి నుంచి నిజామాబాద్ లో సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 

10.దేశ ద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

 

దేశ ద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు ఎటువంటి కేసులు నమోదు చేయకూడదని వెల్లడించింది. 

11.చంద్రబాబు జోలికి వస్తే ఊరుకునేది లేదు

  టీడీపీ అధినేత చంద్రబాబు జోలికి వస్తే ఊరుకునేది లేదని, 60 లక్షల మంది కార్యకర్తలు రోడ్డెక్కుతాం  అని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

12.అసని తుఫాన్

 

అసని తుఫాన్ ప్రభావం ఏపీలో తీవ్రంగా ఉంది.ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ తుఫాను బలహీన పడుతోంది.నరసాపురం కు 30 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

13.ఉచిత కెరియర్ కోర్సులు అందించనున్న టాటా

  ప్రముఖ ఐటీ దిగ్గజం ఉచిత కెరియర్ కోర్సులు అందించేందుకు సిద్ధమైంది.దీనికోసం టి సీయెస్ ఐయాన్ కెరీర్ ఎడ్జ్   ను ప్రారంభిస్తోంది. 

14.వైసీపీ ప్రభుత్వం పై అచ్చెన్నాయుడు కామెంట్స్

 

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

వైసిపి ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. 

15.రఘురామ కృష్ణంరాజు కామెంట్స్

  రాజ ద్రోహం కేసులపై సుప్రీంకోర్టు స్టే విధించడం చారిత్రాత్మకం అని వైసిపి ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. 

16.హిందీ ని ప్రోత్సహించేందుకు ఆరు కోట్లు

  ఐక్యరాజ్యసమితిలోని వ్యవస్థల్లో హిందీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఆరు కోట్ల ను అందించింది. 

17.అన్ని భాషలు సమానమే : మహేష్ బాబు టీమ్

 

Advertisement

హీరో మహేష్ బాబుకు అన్ని భాషలు సమానమేనని మహేష్ బాబు టీం ప్రకటించింది. 

18.జన సైనికులకు పవన్ కళ్యాణ్ పిలుపు

  ఏపీలో తుఫాను నేపథ్యంలో జనసైనికులు ప్రజలకు అండగా నిలవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 

19.బిల్ గేట్స్ కు కరోనా పాజిటివ్

 

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 46,750   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 51,000.

తాజా వార్తలు