న్యూస్ రౌండప్ టాప్ - 20

1.తాప్సి , అనురాగ్ కశ్యప్ ఇళ్లల్లో ఐటీ సోదాలు

బాలీవుడ్ హీరో అనురాగ్ కశ్యప్ హీరోయిన్ తాప్సీ కి చెందిన ఆస్తుల పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ముంబై లో సోదాలు నిర్వహిస్తున్నారు.

2.ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే.

దేశద్రోహం అనలేం

ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంతో ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నమైన భావాలను వ్యక్తపరచడాన్ని దేశద్రోహంగా పేర్కొనలేమని సుప్రీంకోర్టు న్యాయస్థానం స్పష్టం చేసింది.జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్య మంత్రి, ఎంపీ ఫరూక్ అబ్దుల్లా కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

3.కోవిడ్ టీకా తీసుకున్న రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ రోజు కోవిడ్ టీకా తీసుకున్నారు.ఢిల్లీ లోని ఆర్ ఆర్ హాస్పిటల్ లో ఆయన తొలివిడత టీకాను తీసుకున్నారు.

4.రాష్ట్ర బంద్ పోస్టర్ విడుదల

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈ నెల 5వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు.ఈ బంద్ కు సంబంధించిన పోస్టర్ ను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో విడుదల చేశారు.

5.కరోనాతో ఓకే రోజు 1641 మరణాలు

బ్రెజిల్ లో కరోనా వైరస్  వేగంగా విజృంభిస్తోంది.గడచిన 24 గంటల్లో అక్కడ భారీగా కేసులు నమోదయ్యాయి.సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు 24 గంటల వ్యవధిలో 1641 మంది కరోనా తో మరణించారు.

6.టీడీపీ కేడర్ కు అచ్చెన్న హెచ్చరికలు

Advertisement

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి టిడిపి విధానాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యక్తిగత ప్రకటనలు జారీ చేస్తే చర్యలు తప్పవని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు హెచ్చరించారు.

7.గంటల వ్యవధిలో 4 వేల నాటు కోళ్లు మృతి

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పరిసరప్రాంతాలు సుమారు నాలుగు వేల నాటు కోళ్లు గంటల వ్యవధిలోనే మరణించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

8.వైసీపీలో చేరిన గంటా అనుచరుడు

విశాఖ టీడీపీ నాథ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైసీపీలో విజయసాయి రెడ్డి సమక్షంలో చేరారు.

9.12 పంచాయతీలు 765 వార్డులకు కొత్త నోటిఫికేషన్

ఏపీలో ఎన్నికలు జరగని పంచాయితీలు వార్డులకు కొత్త నోటిఫికేషన్ విడుదలైంది.సాంకేతిక కారణాలు , నామినేషన్ దాఖలు కాని 12 పంచాయతీలు 765 వార్డులకు బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

10.నేడు తెలంగాణ ఐసెట్ కమిటీ భేటీ

తెలంగాణ ఐసెట్ కమిటీ ఈ రోజు సమావేశం కానుంది.

ఈ సందర్భంగా ఐసెట్ కమిటీ షెడ్యూల్ కమిటీ ఖరారు చేయనుంది.వచ్చే నెల 3న నోటిఫికేషన్ విడుదల కానుంది.

  6 నుంచి ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించనున్నారు.ఆగస్టులో తెలంగాణ ఐసెట్ ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

11.లేగదూడ పై క్రూర మృగం దాడి

రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్నగర్ మండలం బూర్గుల వద్ద గుర్తు తెలియని క్రూరమృగం సంచారం కలకలం రేపుతోంది.పశువుల దొడ్డిలో లేగదూడ పై దాడి చేసింది.దీంతో ఇది చిరుత గా అంతా అనుమానిస్తున్నారు.

12.కెసిఆర్ నువ్వు కూడా జైలుకే వెళ్తావ్ : సంజయ్

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

కెసిఆర్ నువ్వు కూడా జైలుకే వెళ్తావ్ అంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

13.చాకలి ఐలమ్మ మనవడి మృతి

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవడు చిట్యాల లక్ష్మీ నరసింహ అనారోగ్యంతో మృతి చెందారు.

14.కోదండరామ్ కు టిడిపి మద్దతు

ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీజేఎస్ నుంచి బరిలో నిలిచిన కోదండరామ్ కు తెలంగాణ టిడిపి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు అశ్వారావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు మీడియాకు తెలిపారు.

15.ఏటీఎం సొమ్ము గోల్ మాల్

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో ఏటీఎం సొమ్ము గోల్మాల్ అయింది.ఏటీఎంలలో పెట్టవలసిన 43.93 లక్షల సొమ్మును సంస్థ ఉద్యోగులు కాజేసినట్టు సమాచారం.ఈ మేరకు సంస్థ రూట్ ఆఫీసర్ గాదే రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

16.నీరా టాండన్ నియామకంపై బైడెన్ వెనక్కి

Advertisement

అమెరికా బడ్జెట్ చీఫ్ గా భారత అమెరికన్ నీరా టాండన్ నియామకం పై ఆ దేశ అధ్యక్షుడు జో బైడన్ వెనక్కి తగ్గారు.నీరా నియామకంపై సెనెట్ తో పాటు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.

17.బైడన్ సహాయకుడిగా భారతీయుడు

అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తన పాలనా విభాగంలో మరో భారతీయ అమెరికన్ కు కీలక బాధ్యతలు అప్పగించారు.బైడన్ ఉప సహాయకుడిగా భారత సంతతికి చెందిన మజూ వర్గీస్ ను నియమించారు.

18.తెలంగాణ లో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా కొత్తగా 168 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

19.టీకా కోసం 50 లక్షల మంది నమోదు

భారత్ లో కరోనా వ్యాక్సిన్ ల కోసం ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.వ్యాక్సినేషన్ కోసం ఏర్పాటుచేసిన కోవిన్ పోర్టల్ లో నిన్నటి నుంచి ఇప్పటి వరకు 50 లక్షల మంది తమ వివరాలను నమోదు చేయించుకున్నారని అధికారులు తెలిపారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -42,450 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,300.

తాజా వార్తలు