న్యూస్ రౌండప్ టాప్ 20

1.కరీంనగర్ లో బ్రిటన్ టెన్షన్

కొత్త రకం కరోనా వైరస్ పై కరీంనగర్ లో ఆందోళన నెలకొంది.

బ్రిటన్ నుంచి వచ్చిన వారి వివరాలు అధికారులు ఆరా తీస్తున్నారు.గత 15 రోజులుగా బ్రిటన్ నుంచి కరీంనగర్ కు 16 మంది వచ్చినట్లు గుర్తించారు.

వారిలో పదిమంది శాంపిల్స్ ను వైద్యులు తీసుకున్నారు.మిగతా వారి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.

2.పోలీస్ అధికారుల ఇళ్లపై డ్రోన్స్ కలకలం

హైదరాబాదులో ప్రముఖుల ఇళ్ల పై డ్రోన్ లు ఎగరడం కలకలం రేపింది.

తెలంగాణ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అదనపు డీజీ రవి గుప్త, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇళ్ల పై డ్రోన్ కెమెరా లతో విజువల్స్ తీసినట్లు సమాచారం.దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టారు.

3.కోవాక్స్ వాక్సిన్ తయారీకి అరబిందో ఒకే

యూఎస్ కు చెందిన కోవాక్స్ రూపొందిస్తున్న కోవిడ్ 19 వాక్సిన్ తయారీ, సరఫరాలకు హైదరాబాద్ కు చెందిన అరబిందో ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది.

4.  హీరోగా సోహైల్ ఎంట్రీ

Advertisement

బిగ్ బాస్ సీజన్ 4 లో మూడో ప్లేస్ లో నిలిచిన సొహైల్ ప్రజల్లో విన్నర్ కంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఇప్పుడు ఆయనకు అనేక సినిమా ఆఫర్స్ వస్తున్నాయట.త్వరలోనే ఓ సినిమా తో హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

5.10 రోజుల్లో 10 లక్షలమంది కి వాక్సిన్ లు

యూఎస్ లో ఫైజర్ వాక్సిన్ ల తొలి డోస్ ల పంపిణీ మొదలైంది.ప్రభుత్వం గత పది రోజుల్లోనే పది లక్షల మంది కి పైగా వాక్సిన్లను అందించింది.

6.మహేష్ కు పవన్ క్రిస్టమస్ కనుక

క్రిస్మస్ వేడుకల్లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లేజ్ నేవా దంపతులు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ కి క్రిస్మస్ కానుక అందించారు.ఈ విషయం మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

7.జల్లికట్టు కు గ్రీన్ సిగ్నల్

సాంప్రదాయకంగా నిర్వహిస్తున్న ప్రసిద్ధ జల్లికట్టు క్రీడను జరుపుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ క్రీడను నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది.

8. మాయదారి మైసమ్మ గాయకుడి మృతి

మాయదారి మైసమ్మ, కోడి పాయే లచ్చమ్మ అంటూ మూడు దశాబ్దాలుగా ఉర్రూతలూగించే పాటలతో ఆకట్టుకున్న గేయ రచయిత గాయకుడు పోతరాజు నరసయ్య లింగరాజ్  ( 66) బుధవారం మృతిచెందారు.ఆయన హైదరాబాదులోని బొల్లారం ఆదర్శ్ నగర్ కు చెందినవారు.

9. గుడ్లగూబలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

నామాల అడవి నుంచి గుడ్లగూబ పక్షులను తీసుకొచ్చి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఓ యువకుడిని దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసారు.అతడి వద్ద నుంచి 15 పక్షులను స్వాధీనం చేసుకున్నారు.ఒక్కో పక్షిని లక్ష రూపాయలకు అమ్ముతున్నట్టు పోలీసులు తెలిపారు.

10 .ట్రంప్ క్షమాభిక్ష

అమెరికా అధ్యక్షుడి డోనాల్డ్ ట్రంప్ క్షమాభిక్షల పర్వం కొనసాగుతోంది.తాజాగా ఆయన మరో ముగ్గురికి క్షమాభిక్ష ప్రసాదించారు.

11 .గిరిజనులతో పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సినిమా చిత్రీకరణ విరామంలో గిరిజనులతో ఉల్లాసంగా గడిపారు.వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో భాగంగా అరకు వెళ్లిన పవన్ విరామ సమయంలో ఆదివాసీలతో కలిసి ముచ్చటించారు.

12 .ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీ .ఉద్రిక్తత

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఏఐసీసీ కార్యాలయం నుంచి రాహుల్,ప్రియాంక గాంధీలతో పటు పలువురు నాయకులు రాష్ట్రపతి భవన్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

13 .వైఎస్సార్ కు జగన్ నివాళి

ఏపీ సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్సాఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.

14 .తెలంగాణాలో కరోనా

గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 574 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

15 .కరోనా దేశ ప్రధానిపై 900 కోట్ల దావా

Advertisement

ఇటలీలోని కోవిడ్ 19 మృతుల బంధువులు ఆ దేశ ప్రధానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేయడమే కాకుండా మొత్తం 500 మంది ఒక సమూహంగా ఏర్పడి ప్రభుత్వంపై దావా వేశారు.

16.ఇళ్ల స్థలాల పంపిణీ పై హైకోర్టు తీర్పు

పేదలందరికీ ఇళ్ల పథకం కింద ప్రవేట్ సంప్రదింపుల ద్వారా చేస్తున్న భూ సేకరణ ప్రక్రియను , ఈ నెల 25 న ఇళ్ల స్థలాల పంపిణీని నిలుపుదల చేయడానికి హైకోర్టు నిరాకరించింది.

17 .గ్రీన్ ఇండియా ఛాలంజ్

రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ 4 విజేత అభిజిత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటిన బిగ్ బాస్ 4 ఫెమ్ సోహాల్ .

18 .ప్రియాంక గాంధీ అరెస్ట్

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా రాష్ట్రపతి భవన్ కు వెళ్తున్న ప్రియాంక గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు.

19 .బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ కుమార్తె

సూపర్ స్టార్ మహేష్ , నమ్రత ల కుమార్తె సితార ఓ 3 డీ యానిమేషన్ వెబ్ సిరీస్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.

20 .ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,700 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 50,940.

తాజా వార్తలు