న్యూస్ రౌండప్ టాప్ 20

1.బండి సంజయ్ పాదయాత్ర లో ఉద్రిక్తత

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

టిఆర్ఎస్ శ్రేణులు పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది ఈ ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లాలో చోటు చేసుకుంది. 

2.495 కోట్లతో హైదరాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలు : కేటీఆర్

 

495 కోట్లతో హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 

3.మల్యాల పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ నేతల ధర్నా

  జగిత్యాల జిల్లాలోని మల్యాల పోలీస్స్టేషన్ ముందు కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు.కొండగట్టు ధర్మ పోరాట పాదయాత్ర సందర్భంగా డీజే తీసుకువచ్చిన యువకుడిని పోలీసులు అరెస్టు చేయడంపై నిరసన చేపట్టారు. 

4.ఏడో రోజుకు చేరిన ప్రాణహిత పుష్కరాలు

 

ప్రాణహిత పుష్కరాలు ఏడో రోజుకు చేరాయి. 

5.రేడియాలజిస్టుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

   తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ మీ హౌస్ లో రేడియాలజిస్టులు గా పని చేయడానికి వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి తెలిపారు. 

6.హైకోర్టును ఆశ్రయించిన ఎల్ అండ్ టి మెట్రో

 

Advertisement

దానికి విరుద్ధంగా డిస్కంలు టి ఎస్ ఈ ఆర్ సి విద్యుత్ చార్జీలు పెంచడాన్ని సవాల్ చేస్తూ ఎల్ అండ్ టి మెట్రో రైల్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. 

7 ఎంజీబీఎస్ లో ఉచిత టాయిలెట్ సేవలు

  మహాత్మాగాంధీ బస్ స్టేషన్ లో ఉచిత టాయిలెట్ సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. 

8.మైనార్టీ గురుకులాల్లో ట్రిబ్ ద్వారా నియామకాలు

 

తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ లోని పలు విభాగాల్లో మొత్తం 1445 పోస్టులు ఖాళీగా ఉన్న ఈ పోస్టులు అన్నిటిని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు (ట్రిబ్ ) ద్వారా భర్తీ చేయనున్నారు. 

9.ప్రైవేటు బడుల్లో ఫీజుల కట్టడానికి చర్యలు తీసుకోవాలి

  తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల ఫీజుల రూపంలో దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. 

10.గిరిజన గూడేలకు భగీరథ నీరు

  ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లోని గిరిజన గూడ లోని ప్రజల తాగునీటి కోసం మిషన్ భగీరథ నీటిని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సరఫరా చేశారరు. 

11.కెసిఆర్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీసులకు మంచి పేరు ఉండేదని ఆ వ్యవస్థను సీఎం కేసీఆర్ నాశనం చేశారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

12.సాయి గణేష్ ఆత్మహత్య పై జడ్జితో విచారణ జరిపించాలి

 

బీజేపీ అనుబంధ మజ్దూర్ సంఘ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సాయి గణేష్ ఆత్మహత్య పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బిజెపి డిమాండ్ చేసింది. 

13.మేక్ చివరికల్లా హెల్త్ ప్రొఫైల్

  హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని మే చివరికల్లా పూర్తిచేయాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. 

14.వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

 

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి వారం రోజుల్లో భారీ నోటిఫికేషన్ రాబోతోందని టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు తెలిపారు. 

15.ఎల్సిడి టెస్టుల వివరాలు భద్రంగా ఉన్నాయి

  రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులకు గురైన వారి వివరాలు భద్రంగా ఉన్నాయని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ తెలిపారు. 

16.ఏపీలో అసిస్టెంట్ కన్సర్వేటర్ పోస్టుల భర్తీ

 ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీలో ఫారెస్ట్ సర్వీస్ విభాగంలో పోస్టుల భర్తీ చేపట్టనుంది.  మొత్తం తొమ్మిది ఖాళీలను భర్తీ చేయనున్నారు. 

17.భారత్ లో కరోనా

 

Advertisement

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1247 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

18.ఢిల్లీలో కరోనా పరిస్థితి పై డి డి ఎం ఏ సమీక్ష

 కరోనా డిల్లీ లో మరోసారి విజృంభిస్తోంది ఏప్రిల్ 17 19 మధ్య రెండు రోజుల వ్యవధిలో కేసుల సంఖ్య రెట్టింపయింది.ఈ నేపథ్యంలో ఢిల్లీలో కరుణ పరిస్థితి పై డి డి ఎం ఏ సమీక్ష నిర్వహించింది. 

19.సంజయ్ పాదయాత్రను టిఆర్ఎస్ అడ్డుకోలేదు

 

జోగులాంబ గద్వాల జిల్లా లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను టిఆర్ఎస్ నేతలు అడ్డుకున్నట్లు వార్తలు వచ్చాయని, ఇందులో నిజం లేదని గద్వాల్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 49,850   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 54,380.

తాజా వార్తలు