న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఏపీలో 26 జిల్లాలకు కలెక్టర్ల నియామకం

ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటయ్యాయి .

కొత్త జిల్లాలను ఖరారు చేస్తూ శనివారం అర్ధరాత్రి తర్వాత ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ మేరకు ఇరవై ఆరు జిల్లాలకు 26 మంది కలెక్టర్లను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

2.కోవిడ్ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ గుర్తింపు

XE కోవిడ్ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది.కొత్త వేరియంట్ ఎక్స్ ఈ   గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.

3.న్యూఢిల్లీ ఇర్కాన్ లో పోస్టుల భర్తీ

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ లిమిటెడ్ లో వివిధ విభాగాల్లో మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

4.ఏపీకి అమరావతే రాజధాని

ఏపీకి అమరావతి రాజధాని అని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమవారం మరోసారి అన్నారు.

5.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1096 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

6.ముస్లింలకు ప్రధాని రంజాన్ శుభాకాంక్షలు

రంజాన్ మాసం నేడు ప్రారంభం అయింది.ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ముస్లింలకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు.

7.ఢిల్లీ పర్యటనకు కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.

8.ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.సోమవారం రాహుల్ గాంధీ తో వీరు సమావేశం కానున్నారు.

9.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శనివారం తిరుమల శ్రీవారిని 62,925 భక్తులు దర్శించుకున్నారు.

10.జగన్ రాజీనామా చేయాలి : టిడిపి

Advertisement

ఏపీ సీఎం జగన్ రెడ్డికి నైతిక విలువలు లేవని ఏ మాత్రం ఉన్నా ఎనిమిది మంది వైఎస్సార్ న్యాయస్థానంవిధించిన శిక్షకు బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

11.త్వరలోనే బిజెపిలో భారీగా చేరికలు

బీజేపీలోకి భారీ చేరికలు ఉండబోతున్నాయని  తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

12.బసవతారకం ఆస్పత్రిలో భీమ్ యాప్ ప్రారంభం

రోగులు తమ మెడికల్ రికార్డులను ఎక్కడినుంచైనా వీక్షించే అవకాశాన్ని కల్పించే భీమ్ యాప్ ను ప్రారంభించినట్లు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి పరిశోధన సంస్థ శ్రీభరత్ వెల్లడించారు.

13.నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు

ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ఆదివారం నుంచి ప్రారంభం కానుంది .నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి.

14.రైతులు సుభిక్షంగా ఉండాలి : షర్మిల

శోభకృతు నామ సంవత్సరంలో రైతులు సమైక్యంగా ఉండాలని వైఎస్సార్ టిపీ అధ్యక్షురాలు షర్మిల ఆకాంక్షించారు.

15.ధాన్యం పై 12,600 పంచాయతీల తీర్మానం

యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రాష్ట్రంలోని 12,600 ఎద్దులు పెంచే గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం తీర్మానం చేసి కేంద్రానికి పంపించినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

16.జిల్లాల ఏర్పాటు లో జోక్యం చేసుకోలేం : హై కోర్ట్

కొత్త జిల్లాల ఏర్పాటు 2016లో తీసుకున్న నిర్ణయమని, దీనిపై ఇప్పుడు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు తెలిపింది.

17.యాదాద్రి కాదు యాదగిరిగుట్ట

తెలంగాణ లోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదాద్రి నుంచి యాదగిరిగుట్ట గానే పిలవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

18.ఆత్మీయ సమావేశం

విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఈరోజు ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు.

19.సీబీఐ అధికారి పెద్దిరాజు కు జాతీయ అవార్డు

న్యూఢిల్లీ సిబిఐ లో పనిచేస్తున్న డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ బండి పెద్ది రాజు కు 2019 సంవత్సరానికి గాను కేంద్ర హోం మంత్రి మెడల్ ఫర్ ఎక్స్ లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ పురస్కారం కు ఎంపికయ్యారు.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,950 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,460 .

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 
Advertisement

తాజా వార్తలు