న్యూస్ రౌండప్ టాప్ 20 

1.టాలీవుడ్ డ్రగ్స్ కేసు

  తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారం పై రేపటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ నిర్వహించనున్నారు.

 

2.టిపిసిసి ముఖ్యనేతల భేటీ

Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold

  హైదరాబాద్ గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈరోజు భేటీ అయ్యారు.హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక పై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. 

3.బండి సంజయ్ కాలికి గాయం

Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold

  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుడి కాలి కి గాయం అయ్యింది.ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రాత్రి లంగర్ హౌస్ వద్ద ఉన్న సమయంలో తోపులాట చోటు చేసుకోవడంతో  ఆయన కాలికి గాయమైంది. 

4.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.సోమవారం తిరుమల శ్రీవారిని 23,313 భక్తులు దర్శించుకున్నారు. 

5.మంత్రి ప్రశాంత్ రెడ్డి పి ఆర్వో పై వేధింపుల కేసు

Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold
Advertisement
AP And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold

  తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిఆర్ఓ తోట శ్రీకాంత్ పై పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ లో వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్ర కుమార్ తెలిపారు. 

6.లీజుకు 177 టీటీడీ కళ్యాణ మండపాలు

   ఏపీ తెలంగాణలో టీటీడీ కి చెందిన 177 కళ్యాణ మండపాలు నిర్వహణను లీజుకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. 

7.మీసేవ కేంద్రాల్లో రేషన్ కార్డులు

  గత ఇరవై రోజుల నుంచి తెలంగాణ మీసేవ కేంద్రాల్లో నిలిచిపోయిన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది. 

8.తెలంగాణలో కరోనా

  గడచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 257 కరుణ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

9.ఎమ్మెల్సీగా వాణి దేవి ప్రమాణ స్వీకారం

  హైదరాబాద్ పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానం నుంచి విజయం సాధించిన సురభి వాణి దేవి  శాసన మండలి సభ్యురాలు తాజాగా ప్రమాణస్వీకారం చేశారు. 

10.దమ్ముంటే చర్చకు రావాలి : అచ్చెన్న

  ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దమ్ముంటే వైసిపి చర్చకు రావాలని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న సవాల్ చేశారు. 

11.స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి 200 రోజులు

  స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి నేటితో 200 రోజులు పూర్తయ్యాయి. 

12.చంద్రబాబు ఆగ్రహం

  తెలుగుదేశం పార్టీ నాయకుల పై అక్రమ కేసులు పెట్టడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.దెందులూరు టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 

13.వైయస్సార్ బీమా మిత్ర ల ధర్నా

  వైయస్సార్ బీమా మిత్ర లు సోమవారం ఉదయం ధర్నాకు దిగారు.భీమా సొమ్ము , వేతనాలు చెల్లించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 

14.వై వి యు కు ఏపీ పీజీ సెట్ నిర్వహణ బాధ్యతలు

  ఏపీ పీజీ సెట్ 2021 నిర్వహణ బాధ్యతలను కడప యోగి వేమన యూనివర్సిటీ అప్పగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. 

15.వివేకా హత్య కేసు

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
రైల్వే గేటు పడినా ఆగలే.. బైక్‌ని భుజాన వేసుకొని మరీ దూకేశాడు.. వీడియో చూస్తే!

  మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కొనసాగుతోంది.తాజాగా వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి పులివెందుల ప్రాంతానికి చెందిన ఉమా శంకర్ రెడ్డి అతని తండ్రి దేవనాత్ రెడ్డి ని సీబీఐ అధికారులు విచారించారు. 

16.డ్రగ్స్ కేసులో అరెస్ట్

  డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీని పోలీసులు అరెస్టు చేశారు. 

17.కేంద్ర మంత్రికి రఘురామ లేఖ

Advertisement

  కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు.ఏపీకి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే అని ఆ లేఖలో పేర్కొన్నారు. 

18.ఆఫ్గన్ నుంచి వచ్చేవారికి పోలియో టీకా తప్పనిసరి

  ఆఫ్ఘన్ నుంచి వచ్చే వారికి పోలియో టీకా తప్పనిసరి అని కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 

19.రేపటి నుంచి లండన్ చెన్నై విమాన సేవలు

  రేపటి నుంచి లండన్ నుంచి చెన్నై కి బ్రిటిష్ ఎయిర్ వేస్ విమన సర్వీసులు ప్రారంభించనుంది. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,500   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,500.

తాజా వార్తలు