న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఆలేరు ఎమ్మెల్యే పై హైకోర్టులో పిటిషన్

 

నల్గొండ జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

ఎన్నికల సమయంలో ఆమె ఆస్తులు వివరాలు తక్కువగా చూపారని ఆలేరు గొల్లగూడెం గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. 

2.జగనన్న తోడు పథకానికి నిధులు విడుదల

  తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగనన్న తోడు పథకానికి సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. 

3.వైసీపీ అజెండాపై బీజేపీ డిమాండ్

 

2024లో వైసీపీ అజెండా ఏమిటో చెప్పాలని బిజెపి ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

4.అంబానీ స్కూల్ కు బాంబు బెదిరింపు

  ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని ధీరుబాయ్ అంబానీ స్కూల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.దీనిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. 

5.తెలంగాణకు ప్రధాని మోదీ రాక

 

ఈనెల 19 తేదీన హైదరాబాద్కు నరేంద్ర మోది రానున్నారు. 

6.గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి: కూనంనేని

  గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. 

7.తెలంగాణ సీఎస్ గా శాంతి కుమారి

 

Advertisement

తెలంగాణ ప్రభుత్వ కొత్త సీఎస్ గా శాంతి కుమారి బాధ్యతలు స్వీకరించారు. 

8.రిపబ్లిక్ వేడుకలకు ఏపీ శకటం ఎంపిక

  దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈ సారి ఆంధ్రప్రదేశ్ ఎంపికయ్యింది. 

9.నేడు మైసూరు ఎక్స్ ప్రెస్ రద్దు

 

మైసూరు చెన్నై సెంట్రల్ మధ్య తిరిగే ఎక్స్ ప్రెస్ ను బుధవారం పూర్తిగా రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. 

10.మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు

  ముస్లింలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.భారత్ లో ముస్లిం లు భయపడాల్సిన పనిలేదని అయితే వారు తమ ఆధిపత్యం ఆలోచనలను విడిచిపెట్టాలని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. 

11.నారాయణ సంస్థల్లో సిఐడి సోదాలు

 

ఏపీ మాజీ మంత్రి నారాయణ విద్యాసంస్థల అధినేత కొంగూరి నారాయణకు సంబంధించిన కార్యాలయాల్లో రాష్ట్ర సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. 

12.హోదా అమలు కోసం బస్సు యాత్ర

  ఏపీ హక్కులు , ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఈనెల 20 నుంచి విద్యార్థి యువజన సమరయాత్ర 2.0 నిర్వహించనున్నట్లు ప్రత్యేక హోదా,  విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ తెలిపారు. 

13.పీఈటీ అభ్యర్థుల ఆందోళన

  టీఎస్పీఎస్పీ ముందు గురుకులకు పీఈటి అభ్యర్థులు ఆందోళనకు దిగారు.2017లో కష్టపడి గురుకుల పిఈటి పోస్టులు సాధించినా,  ఇప్పటివరకు పోస్టులు ఇవ్వకపోవడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

14.ఊటీలో రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

 

వేసవి విడిది కేంద్రం ఊటీ లో మంచు విపరీతంగా కురుస్తోంది.ఇక్కడ సాధారణ ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలుగా నమోదయింది. 

15.నాదెండ్ల మనోహర్ కామెంట్స్

 

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

ఆంధ్రప్రదేశ్ లో కొందరు వనరులను దోచుకుని నాయకత్వాన్ని ఎదగనీయకుండా రాజకీయం చేస్తున్నారని పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. 

16.కెసిఆర్ ను కలిసిన కొత్త సిఎస్

  తెలంగాణ కొత్త సిఎస్సి సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతి కుమారి నియమితులయ్యారు.ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆమె కలిశారు. 

17.దేశంలోనే తెలంగాణ పోలీసులు నంబర్ వన్

 

Advertisement

దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని తెలంగాణ హోం మంత్రి మహమూద్ ఆలీ అన్నారు. 

18.కాపు అభ్యర్థి సీఎం కావడం ఖాయం

  వచ్చే ఎన్నికల్లో కాపు అభ్యర్థి సీఎం కావడం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత , కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ వ్యాఖ్యానించారు. 

19.నేడు కృష్ణ యాజమాన్య బోర్డ్ సమావేశం

 

నేడు కృష్ణ యాజమాన్యం బోర్డు సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి ఏపీ తెలంగాణ అధికారులు హాజరయ్యారు.కృష్ణాజిల్లాలో నీటి వాటాలపై చర్చించారు. 

20.కేసీఆర్ బహిరంగ సభ

  ఈ నెల 18న ఖమ్మం తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది.

దీనికి మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ ఏర్పాట్లు చేయిస్తున్నారు.

తాజా వార్తలు