kalyanam kamaneeyam Santosh Shobhan: సంక్రాంతికి మరో చిన్న సినిమా..!

ఇప్పటికే సంక్రాంతి పోరులో బీభత్సమైన పోటీ ఏర్పడగా కొత్తగా మరో సినిమా వచ్చి చేరింది.

అయితే బడా స్టార్స్ మధ్య తాను కూడా రేసులో ఉంటానని అంటున్నాడు యువ హీరో సంతోశ్ శోభన్.

యంగ్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సంతోశ్ శోభన్ ఈమధ్యనే లైక్ షేర్ సబ్ స్క్రైబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇక ఇప్పుడు కళ్యాణం కమనీయం అనే మూవీ చేస్తున్నాడు.

Another Small Movie Release In Pongal Race , Pongal Race, Anil, Kalyanam Kamanee

ఈ సినిమాని కొత్త దర్శకుడు అనీల్ డైరెక్ట్ చేస్తున్నాడు.యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.

సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీని 2023 సంక్రాంతి రేసులో దించబోతున్నారు.ఆల్రెడీ పొంగల్ కి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, వారసుడు వస్తుండగా ఇప్పుడు ఈ కల్యాణం కమనీయం కూడా రాబోతుంది.

Advertisement

మరి పెద్ద సినిమాల మధ్య ఈ యువ హీరో సినిమా నిలబడగలుగుతుందో లేదో చూడాలి. ఆ మూడు సినిమాలకే థియేటర్లు లేవని గోల చేస్తుంటే ఇప్పుడు రేసులో సంతోశ్ శోభన్ కూడా వస్తుండటం రిలీజ్ మరింత టఫ్ అవుతుంది.

మరి ఎవరి సినిమా ఎన్ని థియేటర్లలో వస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు