విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్

విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్ దాఖలు చేసిందని తెలుస్తోంది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ వేసింది.

ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబును విచారించాలని ఏపీ ప్రభుత్వం కోరిందని సమాచారం.ఈ కేసులో చంద్రబాబుపై 2022లో కేసు నమోదు కాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి నారాయణ ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే 420, 166, 34, 26, 37, 120 బి సెక్షన్ కింద సీఐడీ కేసులు నమోదు చేసింది.మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును హౌస్ అరెస్టుకు అనుమతించాలన్న పిటిషన్ ను సీఐడీ వ్యతిరేకిస్తుంది.

ఇందుకు అనుమతి ఇస్తే ఆయన కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని సీఐడీ పేర్కొంది.

Advertisement
అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కమల, ట్రంప్‌లలో గెలుపెవరిది.. యూఎస్ నోస్ట్రాడమస్ ఏం చెప్పారంటే?

తాజా వార్తలు