అతనితో అంజలి లవ్వట..!

తెలుగు అమ్మాయి అయినా ముందు తమిళ్ లో తన టాలెంట్ నిరూపించుకుని తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో లైం లైట్ లోకి వచ్చింది అంజలి.

కాస్త బొద్దుగా ఉంటుందనే తప్ప అంజలి ఈ తరం కుర్రాళ్ల మనసు గెలుచుకుంది.

ఇక చేస్తున్న సినిమాలు.వస్తున్న ఆఫర్లు.

అంత సాటిస్ఫైడ్ గా ఉన్నా లేకుండా అక్కడ ఇక్కడ అడపాదడపా సినిమాలు చేస్తున్న అంజలి తమిళ హీరోతో ప్రేమలో మునిగితేలుతుందట.అది కూడా ఈ నాటి ప్రేమ కాదట 2011 నుండి కంటిన్యూ అవుతుందట.

ఎంగేయుమ్ ఎప్పోదుమ్ సినిమాలో నటించిన జై, అనజలి అప్పటి నుండి ప్రేమలో ఉన్నారని టాక్.రీసెంట్ గా వీరిద్దరు కలిసి మరో సినిమాలో నటిస్తున్నారు.

Advertisement

అంతేకాదు ఆ సినిమా కాగానే ఇద్దరు పెళ్లి చేసుకోవడమే అన్న రేంజ్లో రూమర్లు వస్తున్నాయి.మరి రాజోలు పిల్ల ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా వచ్చిందంటే అందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

ఓ పక్క జై కూడా కోలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.మరి ఇలాంటి టైంలో అంజలితో ప్రేమ దోమా అనడం ఎంతవరకు కరెక్టో మనోడు ఆలోచించాలి.

మరి వీరిద్దరి ప్రేమ వ్యవహారం నిజమా కాదా అన్నది ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పితేనే తెలుస్తుంది.

న్యూస్ రౌండప్ టాప్ - 20
Advertisement

తాజా వార్తలు