చిన్న పిల్లల కోసం సందడి చేయనున్న చుల్ బుల్ పాండే

బాలీవుడ్ లో దబాంగ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ సిరీస్ కి ఇంకా కొనసాగింపు ఉండే అవకాశం ఉంది.

ఇందులో సల్మాన్ ఖాన్ చేసిన చుల్ బుల్ పాండే పాత్ర చిత్రణ ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతుంది.సరదాగా ఉంటూనే రౌడీలకి తన శాడిజం చూపించే చుల్ బుల్ కి భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది.

అందుకే దంబాంగ్ సిరీస్ లు కథలు రొటీన్ గా ఉన్న కూడా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటున్నారు.తాజాగా ప్రభుదేవా దర్శకత్వంలో దబాంగ్ 3 కూడా వచ్చి ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసింది.

ఇదిలా ఉంటే చుల్ బుల్ పాత్రని చిన్న పిల్లలు కూడా భాగా ఎంజాయ్ చేశారు.దీంతో ఇప్పుడు ఈ పాత్రని పిల్లల కోసం ఎనిమేషన్ రూపంలో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

చిన్న పిల్లలు ఆస్వాదించే విధంగా చుల్ బుల్ పాండే పాత్రతో ఓ యానిమేషన్‌ సీరియల్‌ ప్రారంభించనున్నారు.సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌, కాస్మోస్‌ మాయ యానిమేషన్‌ స్టూడియో సంయుక్తంగా ఈ సీరియల్‌ ను నిర్మించనున్నాయి.52 ఎపిసోడ్ల ఈ సీరియల్‌ వచ్చే ఏడాది వేసవికి ప్రసారం కానుంది.చుల్‌ బుల్‌ పాండేతో పాటు ఈ సినిమాలో ముఖ్య పాత్రలయిన రాజ్జో, మఖ్ఖి, చెడ్డీ సింగ్‌ వంటి పాత్రలు కుడా ఈ సీరియల్లో ఉంటాయి.

అయితే ఈ పాత్రలకు సల్మాన్‌ ఖాన్‌ వాయిస్‌ ఓవర్‌ ఉండదని అర్భాజ్ ఖాన్ స్పష్టం చేశారు.అయితే చుల్ బుల్ పాండే పాత్రని రక్తి కట్టించాలి అంటే సల్మాన్ ఖాన్ రేంజ్ లో ఎంటర్టైన్ చేసే వాయిస్ ఉండాలి.

అది ఎంత వరకు సాధ్యం అవుతుంది, ఈ పాత్ర పిల్లల్ని ఎలా మెప్పిస్తుంది అనేది చూడాలి.

సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...

Advertisement

తాజా వార్తలు