నేటి నుంచి అంగన్వాడీలు ప్రారంభం

మే ఒకటో తారీకు నుంచి మే 31 వరకు అంగన్వాడి కేంద్రాలలో( Anganwadi Centres ) ఒక పూట బడి నిర్వహిస్తూ ఆయాకు 15 రోజులు టీచర్కు 15 రోజులు చొప్పున సెలవులు ప్రకటించడం జరిగింది.

ఆయా సెలవుల్లో ఉన్నప్పుడు టీచర్ సెలవులో ఉన్నప్పుడు ఆయాతో విధులు నిర్వహింప చేయడం జరిగింది.

అలాగే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కుటుంబ సర్వే నిర్వహించడం జరుగుతుంది.దానిలో భాగంగా పెరుగుదల పర్యవేక్షణ కూడా నిర్వహించడం జరుగుతుంది.

ఈ సందర్భంగా పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా సెక్టార్ మీటింగ్లు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చెక్కపల్లి సెక్టర్ లో అంగన్వాడీ టీచర్లకి ఓరియంటేషన్ నిర్వహించడం జరిగింది.

అంగన్వాడి బడిబాట కుటుంబ సర్వే పెరుగుదల పర్యవేక్షణ పూర్వ ప్రాథమిక విద్య పాలు గుడ్లు బియ్యం పప్పు నూనె పోపు దినుసులు కురుకురే బాలామృతం నిలువల గురించి పరిశీలించడం జరిగింది.అలాగే తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో స్థానిక వైద్యాధికారి దీప్తి( Medical officer Deepti ) పాల్గొని మహిళలకు సంబంధించి వస్తున్నటువంటి గర్భాశయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం జరిగింది.

Advertisement

అలాగే జీవనశైలి వ్యాధులు బిపి, షుగర్ లాంటివి ఏ విధంగా నియంత్రించుకోవాలి మంచి ఆహార పదార్థాలు ఏ విధంగా తీసుకోవాలి అనే విషయం గురించి కూలంకషంగా వివరించడం జరిగింది.అలాగే ఈ కార్యక్రమంలో బేటి బచావో బేటి పడావోలో భాగంగా ఆడపిల్లలు నిష్పత్తి పెంచడానికి సంస్థాగత డెలివరీలు పెంచడానికి త్రైమాసిక పరీక్షలు చేయించుకోవడం గురించి వివరించడం జరిగింది.

చెక్కపల్లి లో జరిగిన కార్యక్రమంలో సూపర్వైజర్ నిర్మల సిరిసిల్ల ప్రాజెక్టులోని తంగళ్ళపల్లిలో జరిగిన కార్యక్రమంలో సిడిపిఓ అలేఖ్య, మెడికల్ ఆఫీసర్ దీప్తి ,సూపర్వైజర్ సుస్మిత, డిహబ్ కోఆర్డినేటర్ రోజా, జండర్ స్పెషలిస్ట్ దేవిక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News