ఒత్తిడి తెస్తూనే ఉన్నారట...!

ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వం మీద తాను, తన పార్టీ (టీడీపీ) నిరంతరం ఒత్తిడి తెస్తూనే ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

తాము ఒత్తిడి చేస్తున్న కొద్దీ కేంద్రం ఆలస్యం చేస్తోందన్నారు.

ప్రత్యేక హోదా కోసం సాగుతున్న వివిధ ఆందోళన కార్యక్రమాలను ఆయన సమర్థించారు.యూపీఏ ప్రభుత్వం రాష్ర్టాన్ని అశాస్ర్తీయంగా విభజించడంవల్లనే కష్టాలు పడుతున్నామని అన్నారు.

ఏపీకి రాజధాని కట్టుకోవాలంటే కేంద్ర సాయం తప్పనిసరన్నారు.ఆయన ఈ గోడంతా విజయనగరం జిల్లాలో వెళ్లబోసుకున్నారు.

చంద్రబాబు ఎంత ఒత్తిడి తెచ్చినా ఏం ప్రయోజనం? ఆయన మాటలకు కేంద్రం విలువ ఇవ్వడంలేదని అర్థమవుతోంది.ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ప్ర భుత్వం పార్లమెంటులోనే అదీ లిఖితపూర్వకంగా చెప్పినప్పుడే ఇక ఇది అయ్యే పనికాదని తెలిసిపోయింది.

Advertisement

ఎవరెన్ని ఆందోళనలు చేసనా చంద్రబాబు గట్టిగా మాట్లాడందే ప్రయోజనంలేదు.మొత్తం మీద మోదీ సర్కారు ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేసిందనే చెప్పుకోవాలి.

పవన్ ప్లాన్ : పెద్ద నాయకులు టిడిపిలోకి ... చిన్న నాయకులు జనసేనలోకి 
Advertisement

తాజా వార్తలు