ఒకటి పోయింది...మరోటి వచ్చింది

ఒకటి పోయింది.మరొకటి వచ్చింది.

 Modi Chooses Amethi For Smart City-TeluguStop.com

ఎవరికి పోయింది? ఎవరికి వచ్చింది? ఈ రెండూ కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకే.ఆయన నియోజకవర్గంలో యూపీఏ హయాంలో మంజూరైన ఫుడ్‌ పార్కును రద్దు చేసిన ప్రధాన మంత్రి మోదీ, రాహుల్‌ నియోజకవర్గ కేంద్రమైన అమేథీని స్మార్‌్ట సిటీగా చేయాలని నిర్ణయించుకున్నారు.

దీనిపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కు లేఖ రాశారు.అమేథీని స్మార్‌్ట సిటీగా తీర్చిదిద్దాలని జిల్లా అధికారులను ఆదేశించాలని లేఖలో పేర్కొన్నారు.రాష్ర్ట పట్టణాభివృద్ధి అధికారులు ఈ విషయాన్ని జిల్లా అధికారులకు తెలియచేశారు.స్మార్ట్ సిటీగా ఎంపిక చేసిన అమేథీ ఇక అన్నివిధాల ఆధునికంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు చెబుతున్నారు.

అక్కడి యువతకు కూడా ఉద్యోగాలు దొరుకుతాయని అంటున్నారు.మోదీ నిర్ణయంపై అమేథీ భాజపా నేతలు సంతోషపడుతున్నారు.

యూపీఏ పాలనలో జరగని పని మోదీ హయాంలో జరుగుతోందని ఆనందపడుతున్నారు.అమేథీ స్మార్‌్ట సిటీ అవుతే అక్కడి ప్రజలకు గాంధీ-నెహ్రూ కుటుంబంతో బంధం విడిపోతుందని చెబుతున్నారు.

అది స్మార్‌్ట సిటీ అయ్యాక ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube