కొత్త సంవత్సరం సంచలన నిర్ణయాలు తీసుకున్న యాంకర్..!?

రష్మీ గౌతమ్.ఈ పేరు చెబితే చాలు అందరికి ఎక్కడలేని కొత్త ఉత్సహం వచ్చేస్తుంది.

అంతలా రష్మీ ప్రేక్షకుల మదిని గెలుచుకుంది.రష్మీకి ఇంత క్రెజ్ రావడానికి గల కారణం జబర్దస్త్ షో అనే చెప్పవచ్చు.

ఈ షో వలన చాలా మంది జీవితాలు మారిపోయాయి.aఅందులో యాంకర్ రష్మీ కూడా ఒకరు.

తన అంద చందాలతో, డాన్సులతో, నటనతో, హాట్ యాంకర్ గా పేరు సంపాదించుకుంది.నిజం చెప్పాలంటే రష్మీ యాంకర్ అవ్వకముందు కొన్ని సినిమాల్లో కూడా నటించింది.

Advertisement

కానీ ఎన్ని సినిమాల్లో నటించిన గాని రాని గుర్తింపు ఒక్క జబర్దస్త్ షో తో వచ్చేసింది.ఇప్పుడు హీరోయిన్‌ గా ఆమె డేట్స్ కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఈ అమ్మడు అటు సినిమాలు.ఇటు టెలివిజన్ షోలు చేస్తూ రెండు చేతుల బాగానే సంపాదిస్తుంది.

కానీ సక్సెస్ మాత్రం బుల్లితెర తెరపై మాత్రమే వస్తుంది.వెండితెరపై మాత్రం అనుకున్న గుర్తింపు రావడం లేదు.

అందుకనే ఈ కొత్త ఏడాదిలో రష్మీ గౌతమ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది.అందుకోసం ఒక పెద్ద స్కెచ్చే వేసింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

వివరాల్లోకి వెళితే.రష్మి గౌతమ్ నటించిన సినిమాలు అనుకున్న రేంజ్ లో గుర్తింపు రావడం లేదని, కనీసం ఇప్పటి నుంచి అయిన సినిమాలలో నటించే ముందు పారితోషకంతో పాటు కంటెంట్ బాగుంటేనే సినిమాల్లో యాక్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

Advertisement

ఏ స్టోరీ పడితే ఆ స్టోరీని ఒకే చేయకుండా, తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేయాలనీ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.ఈ యేడాది రష్మి గౌతమ్.

నందుతో కలిసి నటించిన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమా సమ్మర్‌ లో విడుదల కానుంది.ఈ సినిమాలో గ్లామర్ పాత్ర కాకుండా.

నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించిందట.

అలాగే రష్మిగౌతమ్ తాజాగా వెబ్ సిరీస్‌ లో కూడా నటిస్తోంది.ఇప్పటికే కొన్ని సెట్స్ పైన ఉన్నాయి.అలాగే వెబ్ సిరీస్‌లు చేయడం వెనక పెద్ద రీజనే ఉంది తెలుసా.

సినిమాలైతే సెన్సార్ ఉంటుంది.కానీ వెబ్ సిరీస్ విషయంలో అలాంటి హద్దులే ఉండవు కదా.అందులోను పెద్ద పెద్ద స్టార్సే ఇందులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.దాంతో ఇప్పుడు తను కూడా ఇదే చేయాలని అనుకుంటుంది.

అందులోను పారితోషికం కూడా భారీగానే వస్తుంది.అలాగే మరోవైపు రష్మి గౌతమ్ ఈ ఏడాది పెళ్లి చేసుకోని సెటిల్ అవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

పెళ్లి తర్వాత యాంకర్‌ గా తన కెరీర్‌‌ ను కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.అంటే ఈ కొత్త సంవత్సరం రష్మీ భారీగానే ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

మరి ఈ సంవత్సరం తనకి కలిసి వస్తుందో లేదో చూడాలి.

తాజా వార్తలు