ఒకేరోజు నాలుగు ఈవెంట్లు.. యాంకర్ సుమను రీప్లేస్ చేసే మరో స్టార్ యాంకర్ లేనట్టేనా?

బుల్లితెర యాంకర్ సుమ( Anchor Suma ) రేంజ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అనే సంగతి తెలిసిందే.

ఎక్కువ మొత్తంలో పారితోషికం తీసుకునే యాంకర్ అయినప్పటికీ ఈ యాంకర్ కు అల్టర్ నేటివ్ లేకపోవడంతో ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు ఈమెకు వస్తున్నాయి.

ఒకేరోజు నాలుగు ఈవెంట్లకు సుమ యాంకర్ గా చేసున్నారంటే ఇండస్ట్రీలో ఆమెకు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది.ఈరోజు కార్తీక పౌర్ణమి కావడంతో ఈరోజు ఎక్కువ సినిమాల ఈవెంట్లు జరిగాయి.

బబుల్ గమ్, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, యానిమల్,( Animal ) హాయ్ నాన్న( Hi Nanna ) సినిమాల ఈవెంట్లకు సుమ యాంకర్ గా ఈరోజు పని చేశారు.బబుల్ గమ్( Bubble Gum ) కొడుకు సినిమా కాగా మిగతా మూడు ఈవెంట్ల ద్వారా సుమకు మూడు లక్షల రుపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ దక్కి ఉండవచ్చని తెలుస్తోంది.

సుమ వయస్సు 48 సంవత్సరాలు కాగా మరో ఐదేళ్ల పాటు సుమ కెరీర్ పరంగా బిజీగా ఉండే ఛాన్స్ అయితే ఉంది.

Advertisement

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఇప్పటికీ సుమ యాంకర్ గా చేస్తున్న షోలు ప్రసారమవుతున్నాయి.కొడుకును హీరోగా నిలబెట్టడానికి సుమ పడుతున్న కష్టం అంతాఇంతా కాదు.సుమ ఈవెంట్ లో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్( Extra Ordinary Man ) ట్రైలర్ రిలీజ్ కాగా ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

షర్మిలను ఇమిటేట్ చేస్తూ నితిన్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది.

వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ, కథనం అందించగా ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.జీవిత, జీవితం రెండూ ఒకటే అంటూ ట్రైలర్ ను ముగించిన తీరు బాగుంది.ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిందని తెలుస్తోంది.

ఈ సినిమా కమర్షియల్ గా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాల్సి ఉంది.

వైరల్ వీడియో : కారుతో ఢీకొట్టి పరారైన బీజేపీ అధ్యక్షుడి కుమారుడు..
Advertisement

తాజా వార్తలు